జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు (2023 సంవత్సరానికి గాను) విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉత్తమ నటుడు అవార్డు మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ఎంపిక తీరును కొంత మంది విమర్శించారు. చాలా కేటగిరీల్లో ఇచ్చిన అవార్డుల మీద జనాలు తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా 'ఆడు జీవితం - ది గోట్ లైఫ్' చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై మలయాళీలు ఫైర్ అవుతున్నారు. 'జవాన్' సినిమాలో షారుఖ్ ఖాన్ నటనకు అవార్డు ఇచ్చారు కానీ 'ది గోట్ లైఫ్', అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన మీకు కనిపించలేదా? అని నెటిజన్లు సైతం మండి పడ్డారు.
పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఎందుకు మిస్...'లగాన్', 'జోధా అక్బర్' దర్శకుడు కారణమా?ఎందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడు కాలేదు? ఈ కాంట్రవర్సీ మీద మలయాళీ ఫిల్మ్ మేకర్, జ్యూరీ సభ్యుడు ప్రదీప్ నాయర్ స్పందించారు. 'కేరళ స్టోరీ'కి అవార్డులు ఎలా ఇస్తారు? కేరళ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా చిత్రాన్ని తీశారని ప్రదీప్ నాయర్ వాదించాడట. కానీ జ్యూరీ సభ్యులంతా కూడా 'కేరళ స్టోరీ'కే అవార్డులు కట్ట బెట్టారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్నే చూపించారని, సినిమాలో టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నాయని అవార్డులు ఇచ్చారట.
Also Read: అవంతికను బాహుబలి రేప్ చేయలేదు... సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వివాదంపై తమన్నా రియాక్షన్
'ఆడు జీవితం' (ది గోట్ లైఫ్) సినిమా కోసం కూడా ప్రదీప్ నాయర్ వాదించారట. ఎన్నో కేటగిరీల్లో 'ది గోట్ లైఫ్'ను సబ్ మిట్ చేశారట. కానీ ఏ ఒక్క కేటగిరీల్లోనూ అవార్డు సంపాదించుకోలేకపోయిందట. జ్యూరీ చైర్ పర్సన్ - 'లగాన్', 'జోధా అక్బర్' సినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాత్రం ఒప్పుకోలేదట. 'ది గోట్ లైఫ్' సినిమాను చూసి ఆయన కన్విన్స్ కాలేదట. అందులో కథ, నటన ఇవేవీ కూడా అథెంటిక్‌గా లేవని, తనకు సహజంగా అనిపించలేదని అశుతోష్ గోవారికర్ స్పష్టం చేశారట. జ్యూరీలో అందరికీ అలానే అనిపించిందట. అందుకే ఉత్తమ చిత్రం కానీ, ఉత్తమ నటుడు అవార్డు కూడా ఇవ్వలేదని ప్రదీప్ నాయర్ తెలిపారు.
బెస్ట్ ప్లే బ్యాక్ మేల్ సింగర్ కేటగిరీలోనూ 'ది గోట్ లైఫ్'ను పంపారట. కానీ అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ లిరిక్స్‌ను సరిగ్గా సబ్ మిట్ చేయలేదట. అలా జ్యూరీ సభ్యులు సినిమాపై అసంతృప్తితో ఉండటంతో ఏ అవార్డు కూడా రాలేదట. కానీ ‘ఉల్లోళుక్కు’ (UlloZhukku) చిత్రానికి మాత్రం జ్యూరీ ఫిదా అయిందట. అందుకే ఉత్తమ మలయాళీ చిత్రంగా ఎంపిక చేశారట.
Also Read: 'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ