Gowtham Tinnanuri About Movie With Ram Charan: యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దీంతో టీం హర్షం వ్యక్తం చేస్తోంది. 'మళ్లీ రావా', 'జెర్సీ' మూవీలతో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీతో మరో ప్రత్యేకత చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రామ్ చరణ్‌తో మూవీ సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Continues below advertisement


వేర్వేరు స్టోరీస్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు చెప్పిన కథతోనే విజయ్ 'కింగ్డమ్' మూవీ తీశారంటూ జరుగుతోన్న ప్రచారంపై గౌతమ్ స్పందించారు. అది నిజం కాదని... అవి రెండూ వేర్వేరు కథలని చెప్పారు. గతంలో చరణ్‌తో మూవీ అంటూ ప్రకటన వచ్చినా అది ట్రాక్ ఎక్కకపోవడానికి రీజన్ వెల్లడించారు. 'మూవీకి సంబంధించి ఓ పాయింట్ చరణ్‌కు చెబితే అది నచ్చింది. అదే ఐడియాతో స్టోరీ రెడీ చేసి రివైజ్ చేసుకుంటే అది చరణ్‌కు సెట్ కాదని అనిపించింది.


చరణ్‌తో మూవీ తీసే గోల్జెన్ ఛాన్స్ కాబట్టి కంగారులో ఏదో ఒకటి తీసేయాలని కాకుండా పర్ఫెక్ట్ స్టోరీతోనే చేయాలని అనుకున్నా. ఈ విషయాన్నే చరణ్‌కు చెప్పి... మరో స్టోరీతో వస్తానని చెప్పాను. ఆ స్క్రిప్ట్ పూర్తైతే చరణ్‌తో తప్పకుండా మూవీ చేస్తాను.' అని స్పష్టం చేశారు.


Also Read: చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ


3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్


యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కింగ్డమ్' మూవీ 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా... సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.