Dhanush About Raanjhanaa Movie Climax With AI: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ సూపర్ హిట్ మూవీ 'రాంఝనా' ఈ నెల 1న బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే, ఆడియన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ మూవీ క్లైమాక్స్‌ను 'AI' సాయంతో చేంజ్ చేశారు మేకర్స్. ఒరిజినల్ క్లైమాక్స్‌ను మార్చి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేంజ్ చేసిన క్లైమాక్స్‌ను యాడ్ చేసి రీ రిలీజ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై తాజాగా హీరో ధనుష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సినిమా వారసత్వానికే డేంజర్
'AI' రూపొందిన క్లైమాక్స్‌తో 'రాంఝనా' (Raanjhanaa) మూవీ క్లైమాక్స్ మార్చి రీ రిలీజ్ చేయడం తనను తీవ్ర కలతకు గురి చేసిందని ధనుష్ అన్నారు. 'ఇది సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసింది. ఇలా మార్చేందుకు నేను అభ్యంతరం తెలపినా సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయి. 12 ఏళ్ల క్రితం నేను కమిట్ అయిన సినిమా అయితే ఇది కాదు. మూవీస్‌లో కంటెంట్ మార్చేందుకు ఏఐని ఉపయోగించడం కళ, కళాకారులు... ఇద్దరికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశం. స్టోరీ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ఇది చాలా డేంజర్. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తారని ఆశిస్తున్నా.' అంటూ 'X'లో ట్వీట్ చేశారు.
Also Read: పృథ్వీరాజ్‌కు నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? 'లగాన్', 'జోధా అక్బర్' దర్శకుడే కారణమా?
ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ జంటగా నటించిన మూవీ 'రాంఝనా'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా 2013లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రీ రిలీజ్ చేయగా... క్లైమాక్స్‌ను ఏఐతో మార్చి యాడ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.