కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్ అంటే ఎంతో అభిమానం చూపించే తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. 'గజినీ' నుంచి మొదలు పెడితే 'రెట్రో' వరకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఆదరించారు. ఇప్పుడు తెలుగు దర్శకుడితో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో తమిళ నటి ఒకరు జాయిన్ అయ్యారు.
సూర్య సరసన మమితా బైజు...కీలక పాత్రలో తమిళ నటి భవానీ శ్రీ!సూర్య శివకుమార్, వెంకీ అట్లూరి సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. ఆవిడకు తమిళంలో తొలి స్టార్ హీరో చిత్రమిది. ప్రదీప్ రంగనాథన్ సినిమా ఒకటి చేస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే సూర్య సినిమా పెద్దది కదా!
ఇప్పుడు సూర్య 46లో భవానీ శ్రీ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనకోడలు. యువ సంగీత దర్శకుడు - హీరో జీవీ ప్రకాష్ కుమార్ సిస్టర్. ఆల్రెడీ ఆవిడ షూటింగ్ చేశారని, సూర్య 46 షెడ్యూల్ ఒకటి పూర్తి చేశారని టాక్.
Also Read: అవంతికను బాహుబలి రేప్ చేయలేదు... సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వివాదంపై తమన్నా రియాక్షన్
భవానీ శ్రీ ఆల్రెడీ తమిళ సినిమాలు చేశారు. వెట్రిమారన్ 'విడుదలై 2'తో పాటు కొన్ని సినిమాల్లో నటించారు. ఒక వెబ్ సిరీస్ చేశారు. ఇప్పుడీ సినిమా ఆమెకు భారీ ఛాన్స్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే... సూర్య 46 సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ సైతం సినిమాలో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది.
Also Read: 'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ