Pushpa 2 Audio Rights Sold For Record Price: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ పాన్‌ ఇండియా చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' పార్ట్‌ 2 ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదలకు రెడీ అవుతుంది. 2021లో విడుదలైన 'పుష్ప: ది రైజ్‌' పార్ట్‌ వన్‌ భారీ విజయంతో ఈ మూవీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న పోస్టర్స్‌, గ్లింప్స్‌ అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో పుష్ప: ది రైజ్‌సై ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి. దీంతో ఈ రిలీజ్‌కు ముందే భారీ మార్కెట్‌ చేస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


రికార్డు ధర 'పుష్ప 2' ఆడియో రైట్స్


ఇందుకోసం ఆ సంస్థ కళ్లు చెదిరే అమౌంట్‌ను బీడ్‌ వేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ కోసం ఏకంగా రూ.100 కోట్లు చెల్లించినట్టు ఇన్‌సైడ్‌ సినీసర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ మ్యూజికల్‌ రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. పార్ట్‌ 1లోని పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్‌ చేశాయో తెలిసిందే. వరల్డ్‌ వైడ్‌ పుష్ప పాటలు మారుమోగాయి. అంతర్జాతీయ వేదికలపై సైతం 'శ్రీవల్లి..', 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' పాటలు వినిపించాయి. అంతగా పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో 'పుష్ప 2'కి ఆడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ క్రేజ్‌తో 'పుష్ప 2' వరల్డ్‌ వైడ్‌ మ్యూజికల్‌ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ, మ్యూజిక్‌ లెబుల్‌ 'టీ-సిరీస్‌'(T-Series) సొంతం చేసుకుందట.


తొలి సినిమా 'పుష్ప 2' రికార్డు


ఇందుకోసం ఏకంగా రూ. 65 కోట్లు చెల్లించినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. అంతేకాదు హిందీ శాటిలైట్‌ టీవీ రైట్స్‌ని కూడా ఈ సంస్థే తీసుకుందట. ఇక తెలుగు శాటిలైట్‌ హక్కులను 'స్టార్‌మా' సొంతం చేసుకున్నట్టు సమాచారం. పుష్ప మూవీకి ఉన్న క్రేజ్‌, డిమాండ్‌ మేరకు వివిధ వేదికల నుంచి కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయట. 'పుష్ప 2' ఆడియో రైట్స్‌ (Pushpa Audio Rights) ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇండియన్‌ మూవీ చరిత్రలో పాటలు ఈ రేంజ్‌లో అమ్ముడవ్వడం ఇదే తొలిసారి. తొలి సినిమాగా 'పుష్ప 2' రికార్డు సెట్ చేసింది. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' రెండు భాగాలు, 'ఆర్‌ఆర్‌ఆర్‌' కంటే 'పుష్ప 2' ఆడియో రెట్సే ఎక్కువ. దీంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.


ఇలా రిలీజ్‌కు ముందే పుష్ప భారీగా మార్కెట్‌ చేయడం చూసి అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక రిలీజ్‌ తర్వాత 'పుష్ప 2' ఇంకేన్ని సంచలనం సృష్టిస్తోంది అంటున్నారు. ఏ రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొడుతుందో అని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న 'పుష్ప 2'ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ్‌ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, నటి అనసూయ, సునీల్‌ వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈసినిమా ఆగస్ట్‌ 15న వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతుంది.  


Also Read: సర్‌ప్రైజ్‌ 'భీమా' ఓటీటీ డేట్ వచ్చేసింది - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!