Gopichand Bhima Locks OTT Date and Time Streaming Detail: మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా' (Bhima OTT Release). కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. గోపిచంద్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు ఏ హర్ష. దీంతో విడుదలకు ముందు ఈ చిత్రంపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్, ప్రచార పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఇక ఈ చిత్రంతో గోపిచంద్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పక్కా అనుకున్నారు. అలా భారీ అంచనాల మధ్య మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లోకి వచ్చింది ఈ చిత్రం.
హాట్‌స్టార్‌కు 'భీమా' ఓటీటీ రైట్స్
Hotstar Announce Bhima OTT Release Date: ఇక రిలీజ్ తర్వాత అందరి అంచనాలు తారుమారయ్యాయి. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా భీమా ఓటీటీ అప్‌డేట్‌పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌పు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఓటీటీ రైట్స్ దక్కించుకున్న హాట్‌స్టార్ ఏప్రిల్ 25 నుంచి అందుబాటులోకి తీసురాబోతుంది. దీనిపై ఉగాది సందర్భంగా నిన్న అధికారిక ప్రకటన ఇచ్చింది.
"సర్‌ప్రైజ్ సర్‌ప్రైజ్ యాక్షన్ ప్యాక్డ్, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ 'భీమా' మీ స్క్రీన్స్‌లోకి వచ్చేస్తుంది" అంటూ హాట్‌స్టార్ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు 'సలార్' ఫేం రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ సరసన ప్రియాంక భవానీ శంకర్, మళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీ థియేర్లోకి వచ్చి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది. ఇంకా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్‌పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మధ్య కాలంలో థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలాంటిది భీమా వచ్చిన రెండు నెలలు అవుతున్నా ఇంకా ఈ మూవీ ఓటీటీ డేట్‌పై అనౌన్స్‌మెంట్ రాకపోవడం డిజిటల్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా ఈమూవీ ఓటీటీ రిలీజ్‌పై అనౌన్స్‌మెంట్ రావడం ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు.
Also Read: ఓటీటీకి రాబోతున్న బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!