New Heroine In VD12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా 'ఫ్యామిలీ స్టార్' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ స్టార్ డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ 'జెర్సీ' మూవీ ఫేమ్ గౌతమ్ తిన్నానురితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతున్నా సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. పలు అనివార్య కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కాగా మూవీ టీం ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.
హీరోయిన్ గా తప్పుకున్న శ్రీలీల
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ను నూరి ప్రాజెక్ట్ 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసి ఫస్ట్ లో కూడా రిలీజ్ చేశారు. సినిమాని అనౌన్స్ చేసినప్పుడు శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. నిజానికి శ్రీలీల వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చిందని ఆ మధ్య న్యూస్ వచ్చింది. ఈ సినిమాని ఒప్పుకున్న సమయంలోనే శ్రీలీల వరస షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించలేకపోయింది. దీంతో మూవీ టీం హీరోయిన్ గా శ్రీలీలా తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. శ్రీలీల తర్వాత రష్మిక మందన, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి, రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ వీళ్ళు ఎవరిని కాకుండా మూవీ టీం తాజాగా ఓ కొత్త హీరోయిన్ ని ఫైనల్ చేసినప్పుడు తెలుస్తోంది.
రౌడీ హీరో సరసన 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ
'VD12' ప్రాజెక్టు కోసం మేకర్స్ 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజుని హీరోయిన్‌గా తీసుకోవాలని మొదట అనుకున్నారట. కానీ ఏమైందో తెలియదు ఇప్పుడు ఆమె స్థానంలో విజయ్ దేవరకొండ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేసినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ అవ్వకముందే టాలీవుడ్ లో ఏకంగా రౌడీ హీరో సరసన నటించే అవకాశం అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
ఫస్ట్ టైమ్ అలాంటి రోల్ లో రౌడీ హీరో
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా హీరో ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ సినిమా సాగనుందట. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
Also Read : ప్రియమణి బదులు కీర్తి సురేష్ నటిస్తే - మహానటి 'మైదాన్' వదిలేయడం మంచిదయ్యిందా?