Sunny Leone's Mandira movie first look: సన్నీ లియోన్ గ్లామరస్ స్టార్. గతంలో ఆవిడ ఎటువంటి సినిమాల్లో నటించారనేది పక్కన పెడితే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరైన తర్వాత ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాలు చేశారు. ఇంతకు ముందు నటించిన సినిమాల ఇమేజ్ కంటిన్యూ చేసేలా ఆ క్యారెక్టర్లు ఉండేవి. అయితే, సన్నీ లియోన్ కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా 'రాగిణి ఎంఎంఎస్ 2'. అదొక హారర్ సినిమా. ఇప్పుడు మరోసారి హారర్ సినిమా చేసేందుకు సన్నీ రెడీ అయ్యారు. ఆ సినిమా టైటిల్ 'మందిర'. ఆ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.


తెలుగులో సన్నీ హారర్ సినిమా 'మందిర'
Sunny Leone Latest Telugu Movie: మంచు మనోజ్ 'కరెంట్ తీగ' సినిమాలో సన్నీ లియోన్ స్పెషల్ రోల్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ 'పీఎస్వీ గరుడవేగ'లో స్పెషల్ సాంగ్, విష్ణు మంచు 'జిన్నా'లో కథానాయికగా నటించారు. కొంత విరామం తర్వాత సన్నీ లియోన్ తెలుగు సినిమాకు సంతకం చేశారు.


Also Readమై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?






సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హారర్ సినిమా 'మందిర' (Mandira Movie). దీనిని విజన్ మూవీ మేకర్స్ పతాకంపై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్టుగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


Also Readబాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ



పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా 'మందిర'
'మందిర' ఫస్ట్ లుక్ చూస్తే... గ్లామర్ కంటే లుక్కుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ నెత్తి మీద కిరీటం, డ్రస్ చూస్తుంటే గ్లామర్ క్వీన్ రోల్ తరహాలో ఉంది. కళ్లలో ఎక్స్‌ప్రెషన్ భయపెడుతోంది. 'మందిర' సినిమా గురించి నిర్మాత సాయి సుధాకర్ కొమ్మలపాటి మాట్లాడుతూ... ''సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. త్వరలో మిగతా వివరాలు అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.


Also Read: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...



Sunny Leone's Mandira Movie Crew Details: సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన 'మందిర' చిత్రానికి మాటలు: కె రవీంద్ర కళ్యాణ్ - శ్రీ సాయి, ఛాయాగ్రహణం: దీపక్ డి మీనన్, సంగీతం: జావెద్ రియాజ్, నిర్మాణ సంస్థ: విజన్ మూవీ మేకర్స్, సమర్పణ: కొమ్మలపాటి శ్రీధర్, నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మలపాటి, దర్శకుడు: ఆర్ యువన్.