'మ్యాడ్' (Mad Movie)... కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కాలేజ్ లైఫ్, యూత్ చేసే ఫన్, ఆ కామెడీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square Movie)ను స్టార్ట్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
'మ్యాడ్ స్క్వేర్' సినిమాలోనూ సేమ్ హీరోలు!
Mad Square Movie Cast And Crew: 'మ్యాడ్'లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. ఇప్పుడీ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్'లోనూ ఆ ముగ్గురూ హీరోలుగా నటించనున్నారు. వాళ్ల సరసన ఎవరు నటిస్తారు? ఇందులో హీరోయిన్లు ఎవరు? అనేది త్వరలో వెల్లడించనున్నారు.
'మ్యాడ్' సినిమాతో కళ్యాణ్ శంకర్ రచయితగా, దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సితార సంస్థ నిర్మించిన భారీ బ్లాక్ బస్టర్ 'టిల్ స్క్వేర్' సినిమాకు రచనా విభాగంలో పని చేశారు. దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన... ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర హారిక, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Also Read: మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
'మ్యాడ్ స్క్వేర్' పూజకు ముఖ్య అతిథిగా 'టిల్లు స్క్వేర్'
ఉగాది సందర్బంగా పూజా కార్యక్రమాలతో 'మ్యాడ్ స్క్వేర్' సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 'డీజే టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' ఎంత సంచలన విజయాన్ని సాధించిందో... 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని చిత్ర నిర్మాతలు బలమైన నమ్మకంతో ఉన్నారు.
Also Read: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడికి సిద్ధూ స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తెతో పాటు ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర చిత్ర ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఇంతకు ముందు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభమైన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ 'మ్యాడ్ స్క్వేర్'తోనూ కంటిన్యూ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. 'మ్యాడ్'తో పోలిస్తే ఈసారి రెట్టింపు వినోదం అందిస్తామని తెలిపారు. 'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: షామ్ దత్, ఎడిటర్: నవీన్ నూలి.