Harsha Chemudu's Sundaram Master review: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు పలు సినిమాల్లో 'వైవా' హర్ష (హర్ష చెముడు) ప్రేక్షకుల్ని ఎంతో నవ్వించారు. అవకాశం వచ్చినప్పుడు కొన్ని సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు 'సుందరం మాస్టర్' సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23న) థియేటర్లలో విడుదల అవుతోంది. గురువారం రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో వేశారు. ఆ షో టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏం అంటున్నారు? అనేది ఒక్కసారి చూడండి.
ఫస్టాఫ్ సూపర్... ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి!
'సుందరం మాస్టర్' ఫస్టాఫ్ సూపర్ అని పలువురు నెటిజనులు ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కథా నేపథ్యం కొత్తగా ఉందని చెబుతున్నారు. వైవా హర్షతో పాటు మిగతా నటీనటులు అందరూ నవ్వించారని, ఇంగ్లీష్ స్పెల్లింగ్ సీన్ చూసినప్పుడు థియేటర్లలో ప్రతి ఒక్కరూ నవ్వుతారని ప్రీమియర్ షో చూసిన వాళ్ళు చెబుతున్నారు.
సుందరం మాస్టర్ మెసేజ్ బావుంది కానీ... ఎగ్జిక్యూషన్ బాలేదా?
ఇంటర్వెల్ ముందు నవ్వించిన సుందరం మాస్టర్... తర్వాత అంతగా కామెడీ చేయలేదని టాక్ వినబడుతోంది. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ ఎక్కువ ఉందని, ఆ సన్నివేశాలను సరిగా తీయడంలో ఫెయిల్ అయ్యారని టాక్. స్టోరీ ఐడియా, కొన్ని సీన్లు బాగున్నప్పటికీ... సినిమాలో సోల్ మిస్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు హర్ష చెముడు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, థియేటర్లలో ఎటువంటి టాక్ వస్తుందో చూడాలి.
గమనిక: సోషల్ మీడియాలో కొందరి అభిప్రాయాలను పాఠకులకు తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. నెటిజనులు చేసిన పోస్టులకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఏబీపీ దేశం బాధ్యత వహించదు.