సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని చిన్న సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి కూడా. కంటెంట్ ఉండాలే కానీ అది ఏ సినిమా అయినా హిట్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎంతో మంది యంగ్ డైరెక్టర్, యాక్టర్స్ చిన్న సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు. వైవా హర్షగా పేరు తెచ్చుకున్న హర్ష చెముడు ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ (Sundaram Master Movie) అనే సినిమా తెరెక్కబోతుంది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద (Divya Sripada) కనిపించనుంది. ఈ మూవీను సుధీర్ కుమార్ కుర్రుతో క‌లిసి మాస్ మ‌హారాజా ర‌వితేజ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రవితేజ్ విడుదల చేశారు. 


రవితేజ సహకార నిర్మాణంలో..


మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ పలు సినిమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు రవితేజ. గతంలో కూడా ఆయన ‘రావణాసుర’, ‘మట్టి కుస్తీ’, ‘చాంగురే బంగారు రాజా’ వంటి సినిమాలకు నిర్మాతగా సహకారం అందించారు.  సినిమా నిర్మాణాల కోసం రవితేజ్ టీమ్ వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారాయన. ఇప్పుడు తాజాగా వైవా హర్ష ప్రధాన పాత్రలో వస్తోన్న ‘సుందరం మాస్టర్’ సినిమాను గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్ సుధీర్ కుమార్ కుర్రుతో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 


ఇంగ్లీష్ మాస్టారుగా వైవా హర్ష..


‘సుందరం మాస్టర్’ సినిమాలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద జంటగా కనిపించనున్నారు. ఈ మూవీలో హర్ష సుందరం అనే మాస్టార్ పాత్ర పోషిస్తున్నాడు. సినిమా అంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రకటించారు మేకర్స్. మూవీలో సుందరం మాస్టార్ గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ సబ్జెక్టు చెప్తుంటాడు. అయితే ఓ మారుమూల పల్లె లో ఉన్న స్కూల్ కు ఇంగ్లీష్ మాస్టారుగా వెళ్లాల్సి వస్తుంది. ఆ స్కూల్ లో అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించాడు అనే విష‌యం తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేనన్నారు మేకర్స్. ఇక మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.


Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హర్ష తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. గతంలో వచ్చిన ‘కలర్ ఫోటో’ వంటి సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ ‘సుందరం మాస్టర్’ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనున్నాడు హర్ష. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి దీపక్ ఎరెగ‌డ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. 


Also Read: థియేటర్లలోకి వచ్చేస్తున్న 'రుద్రంగి' - రిలీజ్ ఎప్పుడంటే? 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial