సుహాస్ (Actor Suhas) వరుస విజయాలతో దూసుకు వెళుతున్నారు. 'హిట్: ది సెకండ్ కేస్'లో ఆయన రోల్ ఆడియన్స్ ఎంతో మందిని సర్‌ప్రైజ్ చేసింది. సోలో హీరోగా 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు'తో విజయాలు అందుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'ప్రసన్న వదనం' (Prasanna Vadanam Movie). క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అర్జున్ వైకె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Prasanna Vadanam Movie Cast And Crew: సుహాస్ హీరోగా... పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన 'ప్రసన్న వదనం' చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆసక్తి పెంచాయి. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం... మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా విజయం మీద సుహాస్ ధీమా వ్యక్తం చేశారు.
ఫస్ట్ కాపీ చూశా... డౌట్ లేదు, సక్సెస్ ఫుల్ సినిమా!
''మేం నిన్న (బుధవారం) 'ప్రసన్న వదనం' ఫస్ట్ కాపీ చూశాం. ఈ సినిమా 1000 పర్సెంట్ బ్లాక్ బస్టర్. అందులో మరో సందేహం అవసరం లేదు. మా టీం అంతా మూవీ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సాధారణంగా నా సినిమాలు అన్నీ మౌత్ టాక్ వల్ల ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. ఈ సినిమా కూడా అలాగే వెళుతుంది. అందుకని, వీలు కుదిరిన ప్రేక్షకులు తొందరగా సినిమా చూసి మిగతా ప్రేక్షకులకు చెప్పాలి. నేను హీరోగా నటించిన ఇంతకు ముందు సినిమాల కంటే ఈ 'ప్రసన్న వదనం' చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నా. థియేటర్లలో ప్రేక్షకులకు తృప్తిని ఇచ్చే చిత్రమిది. మాంచి థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కుర్చీ చివర కూర్చుని చూస్తారు. మూవీ అయ్యాక అదిరిపోయిందని చప్పట్లు కొడతారు'' అని అన్నారు.
ఫన్... థ్రిల్... రొమాన్స్... అన్నీ ఉన్నాయి!
'ప్రసన్న వదనం' సినిమాలో ఫన్, థ్రిల్, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్... అన్ని అంశాలు ఉన్నాయని, సుహాస్ అద్భుతంగా చేశారని దర్శకుడు అర్జున్ చెప్పారు. దర్శకుడిగా తనకు తొలి చిత్రమిదని, బాగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''థియేటర్లలో ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'ప్రసన్న వదనం' తప్పకుండా అలరిస్తుంది'' అని చెప్పారు.
Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?
''ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన రావడం మాకెంతో సంతోషంగా ఉంది. మా 'ప్రసన్న వదనం' పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్'' అని నిర్మాత ప్రసాద్ రెడ్డి తెలిపారు. మరో నిర్మాత జెఎస్ మణికంఠ మాట్లాడుతూ... ''నూటికి నూరు శాతం ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి'' అని రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.
Also Read: బాబీ డియోల్... బాలీవుడ్‌లో పవన్ సినిమాకు ప్లస్సే - 'యానిమల్'కు మించి ఉంటుందా?