మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao) రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రెండో వారంలోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ నెట్టింట హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రవితేజ దసరా విన్నర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించారు.


అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవితేజ కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తోనే ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన చిత్రానికి మొదట్లో మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమా నిడివి విషయంలో ఆడియన్స్ నిరాశకులోనయ్యారు. ఈ చిత్రనిడివి దాదాపు 3 గంటలు కావడంతో సినిమా సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అయిందని కామెంట్స్ వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మూవీ టీం సినిమా నిడివిని తగ్గించింది.






దాంతో రెండో వారం నుంచి టైగర్ నాగేశ్వరావు కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సైతం పెరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి టైగర్ నాగేశ్వరరావు రెండో వారంలోనే రూ.50 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు తెలిపారు. దీంతో రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా టైగర్ నాగేశ్వరరావు రికార్డు క్రియేట్ చేసింది. సినిమాలో రవితేజ నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ప్రయోగాత్మక పాత్రల్లోనూ రవితేజ మెప్పించగలరని టైగర్ నాగేశ్వరరావు తో నిరూపించాడు.


సినిమాలో రవితేజ డిఫరెంట్ షేడ్స్ లో టైగర్ నాగేశ్వరరావు పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే సినిమాకు జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. రెండో వారంలో కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా దాదాపు నాన్ థియేట్రికల్ గానే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చుతుంది. ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ మూవీకి వీకెండ్స్ లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ముందు ముందు టైగర్ నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించగా రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించారు. నాజర్, మురళీ శర్మ, అనుపమ్ కేర్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు.


Also Read : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘పెదకాపు1’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial