నవంబర్ మొదలైంది... సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అభిమానుల్లో సంతోషం కనిపించింది. నవంబర్ 1వ తేదీ మిడ్ నైట్ ట్విట్టర్‌లో వాళ్లిద్దరూ హంగామా చేశారు. ఆ తర్వాత మరొక అప్డేట్ వచ్చింది. నవంబర్ 15న పెద్ద ఎత్తున ఈవెంట్ చేయబోతున్నారని. అందులో టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు దానికి ఓ సమస్య వచ్చింది. అదే పేరుతో మరొక సినిమా అనౌన్స్ చేశారు. 

Continues below advertisement

వారణాసి... ఇప్పుడు ఎవరిది?SSMB29 Titled Varanasi: మహేష్ - రాజమౌళి సినిమా ఎస్‌ఎస్‌ఎంబీ29కి 'వారణాసి' టైటిల్ ఖరారు చేసినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే... ఆ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు 'వారణాసి' పేరుతో మరో సినిమా ప్రకటన వచ్చింది.

ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రఫ్' గుర్తు ఉందా? ఆ సినిమా దర్శకుడు సుబ్బారెడ్డి కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ టైటిల్ 'వారణాసి'. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తామని నిర్మాణ సంస్థ రామభక్త హనుమా క్రియేషన్స్ పేర్కొంది. సనాతన ధర్మం గొప్పదనం తెలియజేస్తూ మాస్ కమర్షియల్ ఎమోషనల్ అంశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపియింది. ఇందులో స్టార్ హీరో నటిస్తున్నారని, మరొక స్టార్ దర్శకుడు స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారని, సినిమా చిత్రీకరణ వారణాసిలో చేస్తామని తెలిపారు.

Continues below advertisement

'రఫ్' దర్శకుడి 'వారణాసి' ప్రకటన ప్రేక్షకులకు మాత్రమే కాదు... తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే... పాన్ వరల్డ్ రిలీజ్ టార్గెట్ చేస్తూ రూపొందుతున్న సినిమా టైటిల్‌తో మరొక సినిమా అనౌన్స్ కావడం ఆశ్చర్యమే. 'వారణాసి' టైటిల్ వల్ల సుబ్బారెడ్డి సినిమాకు అటెన్షన్ అయితే వస్తుంది. కానీ, ఆ టైటిల్ ఆయన దగ్గర ఉంటుందా? అనేది చెప్పడం సందేహమే. ఛాంబర్ రూల్స్ ప్రకారం రిజిస్టర్ చేయించామని చెప్పవచ్చు. కానీ, 'వారణాసి'కి ముందు మరొక పేరుతో మహేష్ - రాజమౌళి టైటిల్ అనౌన్స్ చేస్తే సుబ్బారెడ్డి అండ్ టీమ్ చేసేది ఏమీ ఉండదు.

Also Readసందీప్‌ రెడ్డి వంగాకు 'కింగ్' కౌంటర్... ప్రభాస్ vs షారుఖ్... ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్?

తమిళ్ సినిమా 'డ్రాగన్'ను తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో రిలీజ్ చేశారు. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు కనుక. గతంలో ఇటువంటి టైటిల్ ఇష్యూ వచ్చినప్పుడు మెయిన్ టైటిల్ ముందు హీరో పేరు యాడ్ చేసి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, మహేష్ 'వారణాసి' లేదంటే మహేష్ & రాజమౌళి 'వారణాసి' టైటిల్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది రాజమౌళి & మహేష్ బాబు టీమ్. దానికి జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Also Readఅల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?