తెలుగు బుల్లితెర వీక్షకులకు స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆవిడను మించిన పాపులర్ యాంకర్ లేరని చెబితే అతిశయోక్తి కాదు. అయితే ఆవిడ కెరీర్ కథానాయికగా మొదలైంది. తర్వాత టీవీ షోస్, సీరియల్స్ చేశారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధం అయ్యారు.
పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సుమ!Suma Kanakala Role In Premante Movie: ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ప్రేమంటే'. ఇందులో ఆనంది కథానాయిక. నవంబర్ 21న విడుదల కానుంది. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. పెళ్లి తర్వాత భార్య భర్తల సంసార జీవితంలో జరిగే సంఘటనలను సరదాగా చూపించినట్టు అర్థం అవుతోంది. టీజర్ ఫన్నీగా కట్ చేశారు. టీజర్ మొత్తం ఒక ఎత్తు... చివరిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సుమ కనకాల సీన్ మరొక ఎత్తు.
'ప్రేమంటే' సినిమాలో సుమ కనకాల హెడ్ కానిస్టేబుల్ రోల్ చేశారు. ఆమె స్టేషన్ హెడ్ వెన్నెల కిశోర్ అని అర్థం అవుతోంది. స్టేషనులో సుమ నిద్రపోవడం... ఆశా మేరీ అంటూ ఆమెను 'వెన్నెల' కిశోర్ నిద్రలేపడం వంటివి ఫన్నీగా ఉన్నాయి. మరి సినిమాలో వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ ఇంకెంత నవ్విస్తాయో నవంబర్ 21న చూడాలి.
Also Read: సందీప్ రెడ్డి వంగాకు 'కింగ్' కౌంటర్... ప్రభాస్ vs షారుఖ్... ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్?
దర్శక రత్న దాసరి నారాయణరావు తీసిన 'కల్యాణ ప్రాప్తిరస్తు'లో వక్కంతం వంశీకి జంటగా సుమ కనకాల నటించారు. కథానాయికగా ఆమె తొలి సినిమా అది. తర్వాత మలయాళంలో కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. అయితే మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. కొంత విరామం తర్వాత 'జయమ్ము పంచాయతీ' చేశారు. అందులో ఆమెది ప్రధాన పాత్ర. ఆ సినిమా తర్వాత సుమ నటించిన సినిమా 'ప్రేమంటే'. సుమ కనకాల సినిమా నవంబర్ 21న విడుదల అవుతుంటే... ఆ తర్వాత డిసెంబర్ 12న ఆమె తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన 'మోగ్లీ' థియేటర్లలోకి రానుంది.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?