Upendra Shiva Rajkumar Raj B Shetty Mass Dance Viral In 45 Movie : కన్నడ సూపర్ స్టార్స్ ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఫాంటసీ యాక్షన్ మూవీ '45 ది మూవీ'. ఈ మూవీకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తుండగా... ఆయన ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

మాస్ సాంగ్... వేరే లెవల్

'గెలుపు తలుపు దొరికే వరకూ దిగులు పడకురా'... 'ఆఫ్రో తపాంగ్' అంటూ సాగే ఈ సాంగ్‌లో శివరాజ్ కుమార్, రాజ్ బి శెట్టి, ఉపేంద్ర మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. రాజ్ బి శెట్టిని అడవిలో కుక్కలు వెంటపడగా ఆయన పరిగెడుతూ ఓ చోట పడిపోతారు. అక్కడి వచ్చిన కొందరు ఆఫ్రికన్ పిల్లలు అతన్ని తమ జాతివాళ్లలా డ్రెస్ చేంజ్ చేసి వెళ్లిపోతారు. ఇదే టైంలో సింహాల మధ్యలో నుంచి శివరాజ్ కుమార్, ఉపేంద్ర ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత సాగే ఉత్సాహంగా సాగే మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది.

Continues below advertisement

ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా... ముగ్గురు స్టార్లతోనూ అదిరిపోయే స్టెప్పులు వేయించారు. యాక్షన్ ఫ్లెయిర్‌తో శివరాజ్ కుమార్, స్టైలిష్ ట్విస్టులతో ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎనర్జీ హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రేజీ సాంగ్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 24 గంటల్లోనే 25 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాటకు తెలుగులో రోల్ రైడా సాహిత్యం అందించగా... వినాయక్, రోల్ రైడా కలిసి పాడారు. యూత్ ఆడియన్స్‌ను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Also Read : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది

ఈ మూవీని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డాక్టర్ కె.రవివర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా వంటి వారు స్టంట్స్ కంపోజ్ చేయగా... అనిల్ కుమార్ డైలాగ్స్ అందించారు.

45 The Movie Technical Team : నిర్మాణ సంస్థ: సూరజ్ ప్రొడక్షన్, నిర్మాత: శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, కథ, సంగీతం, దర్శకత్వం: అర్జున్ జన్య, సినిమాటోగ్రాఫర్ : సత్య హెగ్డే, ఎడిటర్ : కె. ఎం ప్రకాష్, గాయకులు : రోల్ రిడా, వినాయక్, సాహిత్యం: రోల్ రిడా, స్టంట్స్ : డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా, కొరియోగ్రాఫర్ : జానీ బాషా, డైలాగ్స్ : అనిల్ కుమార్.