Siddharth's Operation Safed Sagar Glimpse Out : '3 BHK' మూవీ సక్సెస్ తర్వాత మరో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తమిళ స్టార్ సిద్దార్థ్. కార్గిల్ వార్ టైంలో భారత వాయు సేన చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా రియల్ సంఘటనలతో 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ రూపొందుతోంది. తాజగా ఈ సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement


గ్లింప్స్ ఎలా ఉందంటే?


'ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ ఎప్పుడూ చేపట్టలేదు. ఇందుకోసం కొందరిని ఎంచుకున్నాం.' అంటూ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా సిద్ధార్థ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. కార్గిల్ వార్ టైంలో భారత సైన్యానికి సపోర్ట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ఎలా చేపట్టారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి అనేది సిరీస్‌లో చూపించనున్నారు. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ విజువల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సిద్ధార్థ్ అండ్ టీం ఈ ఆపరేషన్ ఎలా చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహిస్తుండగా... సిద్ధార్థ్‌తో పాటు జిమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, మిహిర్ అహుజా, తరుక్ రైనా, ఆర్నవ్ బాసిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాచ్ బాక్స్ షాట్స్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో అభిజిత్ సింగ్ పర్మార్, కుషాల్ శ్రీవాస్తవ రూపొందిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో త్వరలోనే సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.




Also Read : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు