Ravi Teja's Mass Jathara OTT Platform Locked : మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజ ఫుల్ జోష్, గ్రేస్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Continues below advertisement

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా మూవీ థియేటర్లలోకి వచ్చిన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఓ రెండు వారాలు అటు ఇటు కావొచ్చు. 

Continues below advertisement

ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. మూవీలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించగా... శ్రీలీల టీచర్‌గా కనిపించారు. రవితేజ కెరీర్‌లో ఇది 75వ సినిమా కాగా స్పెషల్‌గా నిలవనుంది. రవితేజ, శ్రీలీలతో పాటు రాజేంద్రప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Also Read : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...

స్టోరీ ఏంటంటే?

లక్ష్మణ్ భేరి (రవితేజ) రైల్వేలో నిజాయతీ గల ఎస్సై. తన కళ్ల ఎదురుగా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. అది తనకు సంబంధం లేకున్నా తన ఆధీనంలోకి తెచ్చుకుని మరీ న్యాయం చేస్తాడు. అలా వరంగల్‌లో పని చేసే టైంలో మినిస్టర్ కొడుకుపై చేయి చేసుకుంటాడు. దీంతో అల్లూరి జిల్లాలోని అడవివరం గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. కొండల మధ్య ఉండే ఆ గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు.

చుట్టుపక్కల రైతులతు అరుదైన గంజాయి రకం శీలావతిని పండించి దాన్ని కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఎస్పీ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. లక్ష్మణ్ ఆ ఊళ్లోకి అడుగు పెట్టడంతోనే శివుడికి ఎదురెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అధికారులను శాసించే శివుడిని ఓ సాధారణ రైల్వే ఎస్సై ఎలా ఎదుర్కొన్నాడు? గంజాయి ట్రాన్స్ పోర్ట్‌ను ఆపగలిగాడా? ఆ గ్రామంలో టీచర్ తులసి (శ్రీలీల)తో ప్రేమకథలో ట్విస్ట్ ఏంటి? లక్ష్మణ్‌కు పెళ్లి కాకపోవడానికి అతని తాతయ్య ఎలా కారణం అయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.