సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' వాయిస్ టీజర్ చూశాక బాలీవుడ్ భగ్గుమంది. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుఖ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన కథానాయకుడు షారుఖ్ ఉండగా... ప్రభాస్ (Prabhas)ను 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఓ సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా అయితే ఇద్దరి లాస్ట్ ఫిలిమ్స్ కలెక్షన్లు తీసి మరీ షారుఖ్ పెద్ద సూపర్ స్టార్ అని తీర్పు ఇచ్చింది. సందీప్ గానీ, ప్రభాస్ గానీ స్పందించలేదు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వచ్చింది. ఆయన కొత్త సినిమా 'కింగ్' టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అది చూస్తే, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ట్వీట్ గమనిస్తే... 'స్పిరిట్'కు, అందులో 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్‌కు కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ vs ఇండియాస్ కింగ్!ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఆయనకు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ ఇస్తూ 'స్పిరిట్' వాయిస్ టీజర్ విడుదల చేశారు. అందుకు బదులుగా హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఏం చేశారో తెలుసా?
'When stars go beyond being “just a superstar” they are called Happy Birthday INDIA’s KING' (స్టార్లు 'కేవలం ఓ సూపర్ స్టార్'గా కాకుండా అంతకు మించి ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళను 'కింగ్' అంటారు. హ్యాపీ బర్త్ డే ఇండియాస్ కింగ్) అని షారుఖ్ ఖాన్‌తో దిగిన ఫోటోను సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొన్నారు. 'కింగ్' సినిమా టైటిల్ రివీల్ వీడియోలో అయితే... 'గుర్తు పెట్టుకోండి... ఒకే ఒక్క కింగ్ ఉన్నాడు' అని పేర్కొన్నారు.
Also Read: తేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?
'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్'కు కౌంటర్ కింద 'ఇండియాస్ కింగ్' అని సిద్ధార్థ్ ఆనంద్ చెప్పారని పలువురు ప్రేక్షకులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భావిస్తున్నారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తేడాలు లేకుండా... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి సినిమాలు అయితే వసూళ్లు రాబడతాయో? బాక్సాఫీస్ దగ్గర ఎవరి సినిమాలకు అయితే ఎక్కువ కలెక్షన్లు వస్తాయో? ఆ హీరోయే పెద్ద సూపర్ స్టార్ అవుతారు.
సాధారణంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఫ్యాన్ వార్స్ చేయడం చూశాం! కానీ, ఇప్పుడు ఇద్దరు దర్శకులు... అదీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళు ఈ తరహా ట్యాగ్స్ ఇవ్వడంతో ఇన్ డైరెక్ట్ ఫ్యాన్ వార్ జరుగుతున్నట్టు ఉంది. అందుకని తెలుగుతో పాటు హిందీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం నిశితంగా గమనిస్తున్నారు. రెండు సినిమాల విడుదల సమయంలో దర్శకులు మీడియా ముందుకు రాక తప్పదు. అప్పుడు ఈ క్వశ్చన్స్ ఫేస్ చేయక తప్పదు.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?