తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుల్లో అజయ్ (Actor Ajay) ఒకరు. తెలుగులో అగ్ర కథానాయకులు చాలా మందితో ఆయన పని చేశారు. హీరో ఫ్రెండ్, విలన్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. మధ్యలో హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత మళ్ళీ హీరోగా అజయ్ సినిమా చేస్తున్నారు.

Continues below advertisement

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ది బ్రెయిన్'తో!అజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'ది బ్రెయిన్' (The Brain). ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇటువంటి జోనర్ సినిమాలకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకని అజయ్ (Ajay New Movie)తో పాటు దర్శక నిర్మాతలు సినిమాపై నమ్మకంగా ఉన్నారు. 

'ది బ్రెయిన్'ను ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎండ్లూరి కళావతి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి ప్రధాన తారాగణం. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Continues below advertisement

Also Read: సందీప్‌ రెడ్డి వంగాకు 'కింగ్' కౌంటర్... ప్రభాస్ vs షారుఖ్... ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్?

'ది బ్రెయిన్' గురించి దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ... ''ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రైమ్, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: యూఎస్ విజయ్, సంగీతం: ఎంఎల్ రాజా, మాటలు: పోతు గడ్డ ఉమా శంకర్.

Also Readఅల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?