సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో 'SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. 'అతడు',  'ఖలేజా' వంటి సినిమాల తర్వాత లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇతర అగ్ర హీరోల సినిమాల టైటిల్స్ పోస్టర్లు రిలీజ్ అయి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.


కానీ మహేష్ బాబు సినిమా టైటిల్ ని ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడంతో ఈ విషయంలో అభిమానులు చిత్ర యూనిట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉండగా.. తాజాగా మేకర్స్ వారికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ని అందించారు. మే 31న మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని 'SSMB28' టైటిల్ అండ్ గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ  నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ థియేటర్స్ లోనే ' SSMB28' టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు మహేష్ యుఫోరియా మొదలు అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో మహేష్ ఊర మాస్ లుక్ అయితే సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.


మొత్తంగా మే 31 ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ రాబోతుందన్నమాట. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ - త్రివిక్రమ్ మూవీకి 'అమరావతికి అటు ఇటు', 'ఊరికి మొనగాడు', 'గుంటూరు కారం' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం' ఈ రెండు టైటిల్స్ లో ఏదో టైటిల్ ని మూవీ యూనిట్ ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం 'SSMB28'కి 'గుంటూరు కారం' అనే టైటిల్ అయితే బావుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేయంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.






Also Read: జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌‌గా సితార - ఇండియాలోనే ఫస్ట్ స్టార్ కిడ్‌గా రికార్డ్!