Salman Khan : భద్రతా కారణాల దృష్ట్యా అబుదాబిలో జరుగుతున్న IIFAలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బాడీగార్డులు విక్కీ కౌశల్‌(Vicky Kaushal)ను కలవనివ్వలేదు. సల్మాన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన బాడీ గార్డులు వీక్కిని పక్కకు నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సల్మాన్ తన భద్రత సిబ్బందితో కలిసి వెళుతున్నప్పుడు.. విక్కీ తన అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో ఉంది. అదే సమయంలో విక్కీ సల్మాన్‌ను కరచాలనం చేయడానికి అతని వద్దకు వెళ్లాడు. కానీ సల్మాన్ భద్రత కారణంగా విక్కీని అతని బాడీగార్డులు దూరంగా నెట్టివేశారు. టైగర్ 3 స్టార్‌ని కలవనివ్వకుండా వారు అడ్డుకున్నారు. ఈ వీడియో రెడ్‌డిట్‌లో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లను పలు రకాలుగా స్పందిస్తున్నారు.  


ఈ వీడియోపై కొందరు మామూలుగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరేమో సల్మాన్ ను మొరటుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ఇంకొందరేమో ఆయన్ను సమర్థిస్తున్నారు. "సల్మాన్ ఇక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని నేను అనుకోను. ఆయన నడుస్తున్నారు, సల్మాన్ విక్కీకి అతని ఛాతీపై చేయి వేసి సలాం చేశాడు. విక్కీ మాట్లాడాలనుకున్నాడు. కానీ అతను మాట్లాడలేదు, అంతేగానీ సల్మాన్ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. విక్కీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు" అని ఒకరు రాసుకొచ్చారు. “నిజాయితీగా చెప్పాలంటే, సల్మాన్ ఖాన్ సిబ్బంది సల్మాన్ ఖాన్ కంటే చాలా అసభ్యంగా ప్రవర్తించారు. విక్కీ కౌశల్ ఈవెంట్ గురించి సల్మాన్ ఖాన్‌కు ఏదో తెలియజేస్తున్నట్లు అనిపించింది. సిబ్బంది అతనిని ఓ వెర్రి అభిమానిలా పక్కకు నెట్టారు. ఎంత మొరటు!" అంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు. 






ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'టైగర్ 3' షూట్‌ను ముగించినట్లు వెల్లడించారు. గురువారం అబుదాబిలో జరిగిన IIFA అవార్డ్స్ 2023 విలేకరుల సమావేశంలో మాట్లాడిన సూపర్ స్టార్.. "నిన్న రాత్రి, నేను టైగర్ (టైగర్ 3) షూటింగ్‌లో ఉన్నాను. నేను 'టైగర్ 3'ని పూర్తి చేసాను. ఇప్పుడు మీరు దీపావళి రోజున 'టైగర్‌'ని చూడవచ్చు. ఇన్షాల్లాహ్. ఇది చాలా హడావిడిగా సాగిన షూట్. కానీ చాలా బాగా సాగింది” అంటూ సల్మాన్ వ్యాఖ్యానించారు.


అంతకుముందు సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సెట్స్ నుంచి ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. డంబెల్ ఎత్తడానికి కూడా కష్టంగా ఉందంటూ ఆయన ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు పులి గాయపడిందని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా టైగర్ 3 YRF స్పై యూనివర్స్‌లో భాగమైన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తర్వాత టైగర్ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మూడవ చిత్రం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు, సూపర్ స్పై జోయాగా కత్రినా కైఫ్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటించారు. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.


Read Also : Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?