Keerthy Suresh : న్యాచురల్ నానితో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దసరా'తో మంచి హిట్ కొట్టింది కీర్తి సురేష్. అయితే, ఆమె సోదరి రేవతి సురేష్ కూడా సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. కానీ, ఆమె రూటు మార్చింది. దర్శకురాలిగా తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది.


ఈ సందర్బంగా తన సోదరి చేయబోయే షార్ట్ ఫిల్మ్‘థ్యాంక్యూ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేశ్ షేర్ చేసింది. “నా సోదరి స్వీట్ షార్ట్ ఫిల్మ్ ‘థ్యాంక్యూ’కి దర్శకురాలిగా అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. రేవతి నీకు లవ్ ఇంకా హగ్స్ పంపుతున్నాను. సురేష్ కుమార్, నితిన్ మోహన్ లు నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ ఆమె పోస్టులో రాసుకొచ్చారు. కీర్తి లాగే ఆమె సోదరి రేవతి కూడా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని, విజయాలను అందుకోవాలనీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ పై స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్స్ రేవతికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.


'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్... ఆ సినిమాలో కీర్తి నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల తెలుగులో రిలీజైన 'దసరా' సినిమా.. మార్చి30న గ్రాండ్‌గా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా.. అన్ని చోట్లా అద్భుతమైన వసూళ్లను అందుకుంది. ఈ సినిమా నాని కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అంతేకాదు ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా టూ మిలియన్‌ డాలర్స్‌ను అందుకుని నాని కెరీర్‌లో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.  






ఇక కీర్తి సురేష్ సినిమాకు సంబందించిన విషయాలకొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోలా శంకర్‌'తో సహా అనేక ప్రాజెక్ట్‌లతోనూ ఆమె బిజీగా ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ మెగాస్టార్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.




పెళ్లి వార్తలపై..


ఇటీవల కీర్తి సురేశ్ పెళ్లిపై వచ్చిన వార్తలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కారణం ఆమె రీసెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోనే. దుబాయ్ కు చెందిన ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేసిన ఆమె.. అతనికి బర్త్ డే విషెస్ తెలియజేసింది. దీంతో ఆ వ్యక్తే కీర్తి సురేశ్ కాబోయే భర్త అంటూ పలు వార్తా కథనాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేశ్.. తన పెళ్లి విషయంలోకి తన మిత్రున్ని లాగొద్దని కోరింది. సమయం వచ్చినపుడు అసలు మిస్టరీ మ్యాన్ ను బయట పెడతానని ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది. అప్పటివరకు చిల్ గా ఉండండి. తన పెళ్లిపై ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.


Read Also : ఓటీటీలోకి వచ్చేసిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ - కానీ!