టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే సితార సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకపోయినా సితార పాపకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశక్తి కాదేమో. ఇటీవల తన తండ్రి నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో స్పెషల్ స ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టార్ కిడ్ మరో ముందడుగు వేసింది. ఏకంగా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది సితార. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ను ఆమోదించే అతిపెద్ద కాంట్రాక్టు పై సైన్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టార్ కిడ్ గా సరికొత్త రికార్డును నెలకొల్పింది సితార. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది మహేష్ కూతురు సితార.


ఇక ఈ ఒప్పందంలో భాగంగా భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని మహేష్ ఫ్యామిలీ ఈ మాత్రం బయటికి రానివ్వలేదు. ఈ విషయంలో అత్యంత గోప్యతని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ మూడు రోజులపాటు ఓ రహస్య ప్రదేశంలో ఇందుకు సంబంధించి యాడ్ ఫిలిం కూడా చిత్రీకరించారు. ఇండియాలోనే స్టార్ టెక్నీషియన్స్ అంతా ఈ కమర్షియల్ షూట్లో పాల్గొన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో టెలివిజన్, ఇతర ప్లాట్ ఫామ్స్ లో ఈ యాడ్ ప్లే కానుంది. ఇక ఈ యాడ్ షూట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ.. సితార తండ్రికి తగ్గ తనయురాలు అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తన తండ్రి ఎలాగైతే బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్నాడో.. ఇప్పుడు తాను కూడా అదే రూట్ లో వెళ్తుందని, తన తండ్రిని ఫాలో అవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇక మహేష్ బాబు కూడా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు సితార కూడా తన తండ్రిని ఫాలో అవుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలోనూ యానిమేషన్ 3D వెబ్ సిరీస్ ఫెంటాస్టిక్ తారకి సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఈ కార్యక్రమాన్ని అప్పుడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో తన తల్లి నమ్రతతో పాటు సితార పాల్గొంది. కాగా సితార ఇటీవల ఏ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యాతో కలిసి సితార ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇదే యూట్యూబ్ ఛానల్ లో గతంలో తన తండ్రి మహేష్ బాబును సితార ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. మొత్తంగా చిన్న వయసులోనే తన మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్న సితార ఇప్పుడు పెద్ద జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.