సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒరిస్సా తీసుకు వెళ్లారు. SSBM29 షూటింగ్ చేస్తున్నారు. ఓపెన్ లొకేషన్ కావడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

మహేష్... రాజమౌళి సినిమాకు లీకుల బెడద!స్టార్ హీరోలతో ఓపెన్ డోర్ లోకేషన్లలో షూటింగ్ చేయడం చాలా కష్టం అని మరోసారి మహేష్ - రాజమౌళి సినిమా (Mahesh Rajamouli Movie)తో అందరికీ అర్థం అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' చిత్రీకరణ గోదావరిఖనిలో జరిగింది. అక్కడ ఫోటోలు,‌ వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ మహేష్ - రాజమౌళి సినిమా ఒరిస్సా షెడ్యూల్ నుంచి వీడియో లీక్ అయ్యింది.

సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు!రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ సినిమాలో మహేష్ బాబు హీరో కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ అందరి కంటే ముందు తెలుసుకోవాలని అభిమానులతో పాటు ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కొంత మంది అత్యుత్సాహంతో లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఆ వీడియో గనుక షేర్ చేశారా అంతే సంగతులు... అకౌంట్స్ లేచిపోతాయి. కాపీ రైట్ యాక్ట్ కింద మహేష్  రాజమౌళి సినిమా యూనిట్ కేసు వేసే అవకాశం ఉంది. సినిమా ఓపెనింగ్ వీడియో కాదు కదా, కనీసం ఫోటో కూడా రాజమౌళి బయటకు రానివ్వలేదు. ఈ తరుణంలో ఏకంగా షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో లీక్డ్ కావడం అనేది పెద్ద షాక్ అని చెప్పాలి.

మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా!ఒరిస్సా షెడ్యూల్ చిత్రీకరణకు రాజమౌళితో పాటు ఈ సినిమాలో విలన్ చేస్తున్న మలయాళ కథానాయకుడు - దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి మీద చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది.

Also Readమళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కే ఎల్ నారాయణ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు...' పాటకు  ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో రాజమౌళి సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి చూపు పడుతుంది వాటిని దృష్టిలో పెట్టుకుని ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించేందుకు ఆయన రెడీ అయ్యారు.

Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?