Rasha Thadani's Azaad Movie OTT Release On Netflix: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (Rasha Thadani) ఫస్ట్ మూవీ 'ఆజాద్' (Azaad). ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డయానా పెంటీ, ఆమన్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు.
ఈ నెల 14 నుంచి ఓటీటీలోకి..
ఈ మూవీ ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. బ్రిటిష్ కాలం నాటి పాలనలో సాగే ఓ పీరియాడిక్ డ్రామాగా 'ఆజాద్' రూపొందింది. ఓ తిరుగుబాటు నాయకుడి గుర్రంతో అనుబంధం ఏర్పరుచుకున్న యువకుడు.. అతని మరణం తర్వాత దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ క్రమంలో తన ప్రేమ, కలల సాకారానికి ఆ యువకుడు ఏం చేశాడనేదే కథ. ఈ మూవీలో గుర్రం కీలక పాత్ర పోషించింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయిన 'ఆజాద్' తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
కంగనా 'ఎమర్జెన్సీ' కూడా..
మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఎమర్జెన్సీ' (Emergency) మూవీ సైతం ఈ నెల 14 నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 17న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇందిరా ఆమె హయాంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని మూవీ తెరకెక్కించారు. కంగనా రనౌత్.. ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పాడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు.
ప్రస్తుతం ఓటీటీల్లోకి వచ్చే పలు సినిమాలు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండగా.. 'ఎమర్జెన్సీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. దీంతో వాయిదా పడుతూ వచ్చిన సినిమా థియేటర్లలోకి వచ్చి ఇప్పుడు ఓటీటీల్లోకి రానుంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోదారి యువకుడి 'పరాక్రమం' - ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచో తెలుసా?