RC16 Movie Update: ఫేమస్ భూత్ బంగ్లాలో రామ్ చరణ్ ' RC16' మూవీ షూటింగ్ - స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఓకే.. మరి అసలు స్టోరీ అదేనా..?
Ram Charan Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో 'RC16' మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ భూత్ బంగ్లాలో జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తెరకెక్కుతుండగా.. కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

Ram Charan's RC16 Movie Shooting At Bhoot Bungalow In Hyderabad: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో లేటేస్ట్ మూవీ 'RC16' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తొలి షెడ్యూల్ షూటింగ్ మైసూర్‌లో జరగ్గా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేమస్ భూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూత్ బంగ్లాలో చాలా సినిమాలు షూటింగ్ జరగ్గా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పూర్తి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తెరకెక్కుతుండగా.. రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన రోల్ అల్టిమేట్‌గా ఉండబోతోందని సినీ వర్గాల టాక్.
ఐకానిక్ ప్లేసెస్‌లో షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో 'RC16' మూవీ రూపొందుతుండగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను మైసూర్‌లో పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా.. నెక్స్ట్ షెడ్యూల్ దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఐకానిక్ ప్రదేశాల్లో షూటింగ్ చేస్తారని సమాచారం. పార్లమెంట్, జామా మసీదు వంటి ఐకానిక్ ప్రదేశాల్లో రామ్ చరణ్‌పై పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనుమతుల కోసం మూవీ టీం దరఖాస్తు చేసుకోగా.. సంబంధిత అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సినిమా గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుండగా.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మూవీకి సంబంధించి 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే రెహమాన్ తెలిపారు.
Also Read: అట్టహాసంగా 'ఐఫా' ఓటీటీ అవార్డ్స్ 2025 వేడుక - పురస్కారాలు అందుకున్నది వీరే..
అదిరిపోయిన జాన్వీ ఫస్ట్ లుక్
మూవీలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ పల్లె వాతావరణంలో కుడి చేతిలో ఓ గొర్రె పిల్ల, ఎడమ చేతిలో ఓ గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ చాలా అందంగా కనిపించారు. ఇది ఓ పాటలో స్టిల్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగుతుండగా.. రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మూవీకి సంబంధించి టైటిల్‌ను ఈ నెల 27న అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.