Manchu Vishsnu's Dhee Movie Re Release On March 2025: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్స్, రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు హిట్ కొట్టిన సినిమాలను ఆడియన్స్ కోరిక మేరకు థియేటర్లలో మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి మరో మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటించిన లవ్, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఢీ' (Dhee) మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఈ నెల 28న రీ రిలీజ్ చేస్తున్నట్లు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'హుర్రే' అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన 'ఢీ' మూవీ విష్ణు కెరీర్‌‍లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటించగా.. శ్రీహరి, సునీల్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు. 






ఫన్నీ ఎంటర్‌టైనింగ్ స్టోరీ


అల్లరి, సరదాగా స్నేహితులతో తిరిగే బబ్లూ (మంచు విష్ణు) చేష్టలతో అతని తండ్రి (చంద్రమోహన్) నిత్యం ఇబ్బందులు పడుతుంటాడు. దీంతో ఎలా అయినా అతన్ని దారిలో పెట్టాలని లోకల్ దాదా శంకర్ గౌడ్ (శ్రీహరి) దగ్గర పనిలో పెడతాడు. అక్కడ పనిలో చేరిన బబ్లూకు బ్రహ్మానందంతో స్నేహం ఏర్పడుతుంది. అక్కడ పని చేస్తూనే శంకర్ గౌడ్ చెల్లెలితో (జెనీలియా) ప్రేమలో పడతాడు. వీరిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతకు ముందే భల్లుతో శంకర్ గౌడ్‌కు ఉన్న శత్రుత్వంతో శంకర్ గౌడ్ చెల్లెలిని చంపాలని ప్లాన్ చేస్తాడు. దీంతో ఆమెను కిడ్నాప్ చేయగా.. బబ్లూ ఆమెను ఎలా కాపాడాడు.. అసలు ప్రేమ, పెళ్లి శంకర్ గౌడ్‌కు తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మూవీలో బ్రహ్మానందం, సునీల్, విష్ణు మధ్య కామెడీ సీన్స్ అదుర్స్ అనిపించాయి. చక్రి సంగీతం కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించిన 'ఢీ' మూవీ అప్పట్లో మంచి వసూళ్లు రాబట్టింది.


Also Read: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?


సమ్మర్‌లోనే కన్నప్ప


ఇక ఈ సమ్మర్‌లోనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో టైటిల్ రోల్‌లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, కాజల్, అగర్వాల్, మోహన్ లాల్, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న మూవీని థియేటర్లలోకి రిలీజ్ చేయనున్నారు. 


Also Read: 'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన