Srinivas Avasarala: సినీ పరిశ్రమలో చాలామంది మల్టీ టాలెంటెడ్ నటీనటులు ఉంటారు. కానీ అన్ని రంగాల్లో ఒకేవిధంగా సక్సెస్ సాధించినవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో శ్రీనివాస్ అవసరాల కూడా ఒకరు. ఒకవైపు నటుడిగా వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డైరెక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఏ చిన్న రోల్ అయినా కూడా కాదనకుండా చేస్తూ.. తన కామెడీ టైమింగ్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. 33 ఏళ్ల ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కొన్నిరోజుల క్రితం పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు శ్రీనివాస్ అవసరాల.


కఠిన నిర్ణయం..


తను ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా, అమ్మాయి ఎక్కడుంది అని అడగగా.. ‘‘రియల్ లైఫ్‌లో అసలు అమ్మాయే లేదు. అదంతా అయిపోయింది. ఇకపై ఉండరు కూడా. పెళ్లి చేసుకోదలచుకోలేదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు శ్రీనివాస్ అవసరాల. ఇక ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాన్ని చెప్తూ.. ‘‘పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే కఠిన నిర్ణయం. హాయిగా మనపాటికి మనం ఉన్నప్పుడు వేరే మనిషిని తీసుకొచ్చి మన లైఫ్‌లో పెట్టడం అనేది కఠిన నిర్ణయమే అని నా ఫీలింగ్. ఇప్పుడు నాపాటికి నేను ఉన్నాను. హ్యాపీగా ఉంది’’ అన్నాడు. 


కష్టం అనిపించలేదు..


అమెరికాలో ఉద్యోగం చేసే శ్రీనివాస్ అవసరాల.. అక్కడ జీవితాన్ని వదిలేసి ఇండియాకు వచ్చి సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు. తను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తన సన్నిహితులు ఏమన్నారో గుర్తుచేసుకున్నాడు. ‘‘ఫ్రెండ్స్ మన మంచి కోసమే చెప్తారు. అవి వింటే మంచి జరగొచ్చు. వేరేవాళ్లు వద్దు అన్నా కూడా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడే దానిపై మనకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. ఎమ్‌బీఏ అయిపోయిన తర్వాత ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్తుంటే అసలు నీకు సినిమా లైఫ్ అంటే తెలుసా అని కంగారుపడ్డారు. నేను ఇది చేయాలనుకున్నాను చేశాను. దానికోసం చేయాల్సింది చేశాను. అందులో పెద్దగా కష్టపడింది ఏం లేదని ఒకవేళ ఉన్నా నాకు అది కష్టంగా అనిపించలేదు’’ అని తెలిపాడు.


మూడేళ్లు పట్టింది..


అప్పటివరకు నటుడిగా ఉన్న శ్రీనివాస్ అవసరాల.. ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా మారాడు. అప్పుడు తనకు ఇండస్ట్రీ నుంచి దొరికిన సపోర్ట్ గురించి తాను స్పందించాడు. ‘‘నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ దొరకడమే కష్టమయ్యింది. ఆ టైమ్‌లో నిర్మాత సాయి కొర్రపాటిని కలవడానికి నాకు మూడేళ్లు పట్టింది. కలిసిన తర్వాత సినిమా కన్ఫర్మ్ అవ్వడం 40 నిమిషాలు అయిపోయింది. అప్పటినుండి నాకు ఇండస్ట్రీలో పరిచయాలు అయ్యాయి. సినిమా తీస్తున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అనే సందేహం ఉండేది. క్రిష్, దిల్ రాజు కూడా సినిమాను నమ్మి సపోర్ట్ చేశారు. మంచి పని చేస్తే పెద్దవాళ్లు ఎప్పుడూ తోడుంటారని నమ్ముతాను’’ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ అవసరాల.


Also Read: ఏంటీ.. త్రిష ఏకంగా రాజమౌళి మూవీ ఆఫర్‌నే తిరస్కరించిందా? - అసలేం జరిగిందంటే..!