Sree Vishnu Latest Interview : 'బ్రోచేవారేవారురా' వంటి క్రేజీ హిట్ తర్వాత శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఓం భీమ్ బుష్'. 'హుషారు' మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురు చాలా డిఫరెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి శ్రీ విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టైటిల్ సజెస్ట్ చేసింది నేనే - శ్రీవిష్ణు
‘‘ఓమ్ భీమ్ బుష్.. టైటిల్ సజెస్ట్ చేసింది నేనే. మా టీమ్ అందరికి కూడా టైటిల్ బాగా నచ్చింది. సో అందరూ చూసిన తర్వాత పెర్ఫెక్ట్ అనుకోని అప్పుడు టైటిల్ పెట్టాం. మాములుగా ఓ ప్రాజెక్ట్ ఓకే ఆయన తర్వాత నేను 6 నెలల నుంచి సంవత్సరం పాటూ టైమ్ తీసుకుంటాను. ఆ ప్రాసెస్ లోనే స్ర్కిప్టు విషయంలో ఏదైనా డౌట్ ఉంటే డైరెక్టర్ తో డిస్కస్ చేస్తాను. ఈ విషయంలో మాత్రం ఎవరి ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. ఎవరు చెప్పినా నేను వినను" అని అన్నారు.
దర్శి, రాహుల్ ఇద్దరి డేట్స్ తో క్లాషెస్
ఈ సినిమా చేసేటప్పుడు దర్శి, రాహుల్ ఇద్దరి డేట్స్ తో క్లాషెస్ వచ్చాయి. దర్శి ఉంటే రాహుల్ ఉండడు, రాహుల్ ఉంటే నేనుండను. అలా చాలా వరకు డేట్స్ క్లాషెస్ వచ్చాయి. సరే మేం ముగ్గురం సెట్ అయ్యాం కదా అనుకుంటే హీరోయిన్ డేట్స్ తో ఇబ్బందులు వచ్చాయి. సినిమాలో మేము ముగ్గురం తప్పితే అందరూ కొత్త వాళ్లనే తీసుకున్నాం. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి మేం ముగ్గురం తప్పా అందరూ ఏదో ఒక విధంగా బిజీ అయిపోయారు. ఇంకొంతమంది ఫేమస్ అయిపోయారు" అని తెలిపాడు.
హీరోయిన్ చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది
ఈ సినిమా మొదలుపెట్టిన సమయంలో కొంతమంది చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్లిపోయారు. అక్కడ ఫేమస్ అయిపోయారు. మేం ముగ్గురమే మెయిన్ అనుకుంటే మిగతా వాళ్ళ కోసం మేం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక హీరోయిన్ అయితే మాకే కాదు ఎవ్వరికీ చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది. ఆమె ఫోన్ కూడా రీచ్ అవ్వలేదు. అలా వెళ్ళినా కూడా వాళ్లందరికీ చాలా మంచి పేరొచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు హీరోయిన్ పేరు చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్లిపోయిందని చెప్పింది బహుశా ఆయేషా ఖాన్‌ను ఉద్దేశించే చెప్పాడని అర్థమవుతుంది.
Also Read : తాత కోసం పాట పాడిన అరియానా - కంటతడి పెట్టిన మంచు విష్ణు!