Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna Crazy Entertainer With Sree Harsha Konuganti Titled Om Bheem Bush, First Look Out Now, Theatrical Release On March 22nd: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ముగ్గురూ కలిశారంటే వినోదం మామూలుగా ఉండదు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ గ్యాంగ్ మళ్లీ కలిసింది. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు 'ఓం భూమ్ బుష్' టైటిల్ ఖరారు చేశారు. నో లాజిక్... ఓన్లీ మేజిక్... అనేది ఉపశీర్షిక.


మార్చి 22న 'ఓం భూమ్ బుష్' విడుదల
Om Bheem Bush movie updates: 'ఓం భూమ్ బుష్' ఫస్ట్ లుక్ చూస్తే... స్పెస్ షిప్ నుంచి దిగిన ఆస్ట్రోనాట్స్ తరహాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లుక్స్ ఉన్నాయి. ఆ ముగ్గురి చుట్టూ గేదలు, పల్లెటూరి జనాలు ఉన్నారు. వాళ్ల చేతుల్లో పాంప్లెట్స్ ఉన్నాయి. పల్లెటూరిలో ఆ ముగ్గురు ఏం చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి. 


మార్చి 22న థియేటర్లలో 'ఓం భూమ్ బుష్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా చిత్ర బృందం వెల్లడించింది. ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 


హిలేరియస్ కామెడీ సినిమాగా 'ఓం భీమ్ బుష్'
దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మొదటి సినిమా 'హుషారు' చూస్తే... అందులో కామెడీ హైలైట్ అయ్యింది. 'ఉండిపోరాదే...' పాట ఆ సినెమాలోనిదే. శ్రీ హర్షకు మంచి కామెడీ టైమింగ్ అండ్ మ్యూజిక్ సెన్స్ ఉన్నాయి. 'హుషారు' తరహాలో 'ఓం భీమ్ బుష్'ను కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారట. ఇక... శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు తెలియనిది కాదు. పైగా... క్యాప్షన్ చూస్తుంటే కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు.


Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!  






'ఓం భీమ్ బుష్' సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''మనం 'ఓం భీమ్ బుష్' మంత్రాలను తాంత్రిక విద్యలు ప్రాక్టీస్ చేసే వాళ్ల దగ్గ వింటుంటాం. మరి ఆ పదాలకు, కథకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది'' అని చెప్పారు.


ప్రీతి ముఖర్జీ, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: విష్ణు వర్షన్, కళా దర్శకుడు: శ్రీకాంత్ రామిశెట్టి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎంఆర్, నిర్మాతలు: వి సెల్యులాయిడ్స్, సునీల్ బలుసు, సమర్పణ: యువి క్రియేషన్స్, రచన - దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి.


Also Readఆస్కార్స్‌ అవార్డుల్లో 13 నామినేషన్స్... బాఫ్టాలో 7 అవార్డ్స్... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?