LYF Love Your Father: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఎస్పీ చరణ్. సింగర్‌గా మాత్రమే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కూడా గుర్తింపు సాధించుకున్నారు. కెరీర్ మొదట్లో చరణ్.. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. ఇప్పుడు మరోసారి చాలాకాలం తర్వాత నటుడిగా ఆన్ స్క్రీన్ కనిపించడానికి సిద్ధమయ్యారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ (LYF Love Your Father). తండ్రీ, కొడుకుల మధ్య అనుబంధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్పీ చరణ్ తండ్రి పాత్రలో నటించనున్నారు.


ఈ సినిమాతో రీఎంట్రీ..


గతంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘మాయలోడు’, ‘వినోదం’ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇలాంటి పాపులర్ ప్రొడక్షన్ హౌజ్‌లో నటుడిగా ఎస్పీ చరణ్ నటుడిగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ చిత్రంలో శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కేతరాజు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ  ప్రొడ్యూసర్స్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో మూవీ ఓపెనింగ్ చాలా ఘనంగా జరిగింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మెంబర్ అయిన కామకూర శాలిని ముందుగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, సంతోష్ రెడ్డి కలిసి స్క్రిప్ట్ అందించారు. 


తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్స్..


‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ మూవీ ఓపెనింగ్‌కు చీఫ్ గెస్టులుగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భద్ర రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ రామస్వామి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ సినిమా విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఇది ఒక తండ్రి, కొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను, ఎమోషన్స్‌ను చెప్పే కథ అని నిర్మాత మహేష్ రాఠీ బయటపెట్టారు. ఈ సినిమాతో శ్రీ హర్ష హీరోగా ప్రేక్షకులకు పరిచయం అవ్వనున్నాడు. మొదటి సినిమాకు అందరి సపోర్ట్ కావాలని శ్రీ హర్ష కోరాడు. ఇక హీరోయిన్ రియా సైతం తమ సినిమా సపోర్ట్ చేయమని కోరింది.


కో డైరెక్టర్‌గా సినిమాలు..


‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ కోసం బాలీవుడ్ కెమెరామ్యాన్‌ను రంగంలోకి దించారు మూవీ టీమ్. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ కేతురాజు.. ఈ మూవీతో దర్శకుడిగా మారాడు. నిర్మాతలే తనను స్వయంగా పిలిచి దర్శకత్వ అవకాశం ఇచ్చారని బయటపెట్టాడు. ఇందులో శ్రీ హర్ష, కషిక కపూర్, ఎస్పీ చరణ్‌లతో పాటు నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ చిత్రానికి సంగీతం అందించడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఓపెనింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.


Also Read: మోదీ ఫోన్ చేసి తిట్టారు, అవి కాస్త కంట్రోల్ చేసుకోవాలి - మిథున్ చక్రవర్తి