Rakul Preet Singh and Jackky Bhagnani Wedding Card: ఒకప్పుడు హీరోహీరోయిన్లు గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇప్పుడు కూడా సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు గ్రాండ్‌గానే జరుగుతున్నా.. ఎక్కువగా దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ హీరోయిన్.. బాలీవుడ్ హీరో, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. రెండేళ్ల క్రితం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అప్పటినుండి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా ఆరోజు వచ్చేస్తోంది. ఇక తాజాగా రకుల్, జాకీల వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ లిస్ట్‌లోకి రకుల్, జాకీ..


2024 మొదటినుండే ఫిబ్రవరీలో రకుల్ పెళ్లి జరగబోతుందని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై రకుల్, జాకీ ఏ మాత్రం స్పందించకుండా తమ పెళ్లి పనులను ప్రారంభించినట్టు తెలుస్తోంది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ఇన్విటేషన్ కార్డ్‌లో ఉంది. 2024 ఫిబ్రవరీ 21 బుధవారం పెళ్లి జరగనుందని అందులో ఉంది. సింపుల్‌గా ఉన్న ఈ పెళ్లి కార్డ్‌ను చూసి నెటిజన్లు.. రకుల్‌కు, జాకీకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా బాలీవుడ్‌లో మరో హీరో, హీరోయిన్ పెళ్లికి సిద్ధమయ్యారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లలో బాలీవుడ్‌లో ఆలియా భట్ - రణబీర్ కపూర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకొని చాలామందికి కపుల్ గోల్స్‌ను అందించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రకుల్, జాకీ కూడా చేరనున్నారు.






అదే మొదటిసారి..


రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి స్క్రీన్‌పై నటించకపోయినా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం వీరి మనసులు కలిశాయి. రకుల్ లీడ్ రోల్ చేసిన ‘రన్‌వే 36’ సినిమాను జాకీ భగ్నానీ నిర్మించాడు. సినిమా ఒప్పుకునేంత వరకు ఈ విషయం తనకు తెలియదని అప్పట్లో రకుల్ బయటపెట్టింది. ఇక వారిద్దరూ కలిసి పనిచేయడం అదే మొదటిసారి. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. జాకీ కూడా నిర్మాతగా కాకుండా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది ఈ జంట. అప్పటినుండి పలుమార్లు వీరి పెళ్లి జరగనుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఫైనల్‌గా ఇప్పటికి వీరి పెళ్లిపై ఒక క్లారిటీ వచ్చింది. 


ప్రైవేట్‌గా పెళ్లి..


ఫిబ్రవరీ 21న రకుల్, జాకీల పెళ్లి అనే విషయం బయటికొచ్చినా.. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయం మాత్రం బయటికి రాకుండా వీరిద్దరూ జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికీ వీరి డెస్టినేషన్‌కు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రాలేదు. తాజాగా వెడ్డింగ్ కార్డ్ బయటికి రావడంతో పెళ్లి గురించి కన్ఫర్మ్ అయ్యింది. పెళ్లి చాలా ప్రైవేట్ వేడుకలాగా జరగాలని రకుల్, జాకీ అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం రకుల్, జాకీ కలిసి థాయ్‌ల్యాండ్ కూడా వెళ్లి వచ్చారట. పెళ్లి కోసం వీరిద్దరూ కొన్నిరోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో శూర్పణఖ పాత్ర చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Also Read: ఆ ప్రభుత్వం ఎందుకలా చేసిందో ఎవరూ అడగరు - భూకేటాయింపుపై ‘యాత్ర 2’ దర్శకుడు మహి వీ రాఘవ