Sourav Ganguly About His Biopic: టీమిండియా క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బయోపిక్‌పై ఎప్పటి నుంచో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో గంగూలీ రోల్ చేసేదెవరు..? దర్శకుడు ఎవరు..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందరో స్టార్ హీరోలు, డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. తాజాగా, తన బయోపిక్‌పై క్రికెట్ దిగ్గజం గంగూలీనే స్వయంగా స్పందించారు. తన రోల్ చేసేదెవరో కూడా ఆయన రివీల్ చేశారు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన బుర్ద్వాన్ వెళ్లి అక్కడ తన బయోపిక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను విన్నంతవరకూ.. టైటిల్ రోల్‌లో రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rav) నటించనున్నారు. అయితే డేట్స్ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా రిలీజ్ అయ్యేందుకు మరో ఏడాదిపైనే టైం పట్టొచ్చు.' అని గంగూలీ చెప్పారు. ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


మూవీ టీం రాజ్‌కుమార్‌ రావ్‌ను సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కించనుండగా.. విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహించనున్నారు. రాజ్ కుమార్ రావ్ గతేడాది 'స్త్రీ 2' మూవీలో లీడ్ రోల్ చేసి మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.800 కోట్లు కొల్లగొట్టి పలు రికార్డులు సృష్టించింది. అంతకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలోనూ రాజ్ కుమార్ తన అద్భుత నటనతో అలరించారు. ఈ క్రమంలోనే గంగూలీ బయోపిక్‌లో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్‌రావ్ కంటే ముందుగా.. గంగూలీ బయోపిక్‌ కోసం ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను సంప్రదించినట్లు సమాచారం. ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్‌లను 'దాదా' పాత్ర కోసం సంప్రదించారని సమాచారం. ఫైనల్‌గా రాజ్‌కుమార్ రావును గంగూలీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.






Also Read: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో 'సీఐడీ' - మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచో తెలుసా?


గంగూలీ జీవిత కథ ఆధారంగా..


బెంగాల్ టైగర్‌, దాదాగా పేరొందిన టీమిండియా స్టార్ క్రికెటర్ 'సౌరవ్ గంగూలీ'.. భారత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన గంగూలీ అంతర్జాతీయ కెరీర్‌లో అన్నీ ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశారు. 2008లో క్రికెట్ నుంచి రిటైరైన అనంతరం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వాటి ఆధారంగానే ఇప్పుడు బయోపిక్ రూపొందుతోంది.


Also Read: మరో ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ - మహిళల తలలు నరికేసే సైకో వాటితో ఏం చేస్తాడంటే..?