Kangana Ranaut's Emergency OTT Release Date Watch On Netflix: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ' (Emergency). రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ జనవరి 17న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను నటి కంగనా ప్రకటించారు. 'ఎమర్జెన్సీ' మూవీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) ఓటీటీ వేదికగా మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుందని తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'ఎమర్జెన్సీ' మూవీని రూపొందించారు.

ఆమె హయాంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని సిద్ధం చేశారు. కంగనా రనౌత్.. ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పాడే నటించారు.  వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో 'ఎమర్జెన్సీ' తీయగా.. రూ.21 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. 'ఎమర్జెన్సీ' మూవీ హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలన్నీ ప్రధాన భాషల్లో విడుదలవుతున్న క్రమంలో ఈ సినిమా కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?

రిలీజ్‌కు ముందే వివాదాలు

'ఎమర్జెన్సీ' మూవీపై రిలీజ్‌కు ముందే వివాదం నెలకొంది. వివిధ సిక్కు సంస్థలు సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి. మూవీ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ డిమాండ్లు మరింత పెరిగాయి. అందులో వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే... ఇందిరా గాంధీకి ఓట్లు వేస్తానని వాగ్దానం చేయడం కనిపించింది. దీంతో... సిక్కు సంస్థలు  అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమర్జెన్సీ సినిమాపై నిషేధం విధించాలని సెన్సార్ బోర్డుకు లేఖలు రాశాయి. దీంతో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో విడుదల సైతం వాయిదా పడింది. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ కాలంలో నెలకొన్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. వివాదాల అనంతరం థియేటర్లలోకి వచ్చి ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Also Read: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?