Gangs of Godavari Special Song Update: యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా తన కమర్షియల్ సినిమా ట్రాక్‌ను మార్చి ‘గామి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలైతే తను హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల డిసెంబర్ నుండి ఈ మూవీ రిలీజ్ లేట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం మే 17న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీంతో ఒక్కొక్కటిగా ఈ సినిమా నుండి అప్డేట్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ సాంగ్‌కు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది సితార ఎంటర్‌టైన్మెంట్స్.
హోలీ సందర్భంగా..
ముందుగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఈషా రెబ్బా ప్రత్యేక గీతంలో కాలు కదపనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ వచ్చింది. విశ్వక్ సేన్, ఆయేషా ఖాన్ కలిసి ‘మోత’ అనే పాటకు స్టెప్పులేయనున్నారు. హోలీ సందర్భంగా మార్చి 25న ‘మోత’ పాట ప్రేక్షకుల ముందుకు రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని జేబీఎస్ కంటోన్మెంట్‌లో ఈ సాంగ్ లాంచ్ జరగనుంది. ఇక ‘మోత’ పాటకు సంబంధించిన మాస్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ‘మోత మోగిపోద్ది’ అని ట్యాగ్‌ను యాడ్ చేసింది సితార ఎంటర్‌టైన్మెంట్స్. ఈ పాట ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అంటూ ధీమా వ్యక్తం చేసింది.
‘ఫలక్‌నామా దాస్’ లుక్‌తో పోలికలు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుండి విడుదలయిన ‘మోత’ పాట పోస్టర్‌లో ఆయేషా ఖాన్ చాలా హాట్‌గా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ ఎప్పటిలాగానే బీడీతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఫలక్‌నామా దాస్’ గుర్తొస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ‘మోత’ పాటను చంద్రబోస్ రాశారు. ‘గామి’తో క్లీన్ హిట్ అందుకున్న విశ్వన్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాడు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ‘గామి’.. బ్రేక్ ఈవెన్‌ను సాధించి విమర్శకుల ప్రశంసలు పొందింది.
అందుకే వాయిదా..
అసలైతే 2023 డిసెంబర్‌లోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. డిసెంబర్ నుండి తెలుగు సినిమాల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. విడుదల తేదీ కోసం మేకర్స్ అంతా ఎన్నో చర్చలు జరిపారు. దీంతో డిసెంబర్‌లో విడుదల కాలేని చిత్రాలు ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల చేయడానికి కుదురుతుందని మేకర్స్ అంతా కలిసి నిర్ణయించుకున్నారు. అందులో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా చేరింది. అంతే కాకుండా ‘గామి’ ప్రమోషన్స్ సమయంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ టీమ్‌లోని ఒక వ్యక్తి కుటుంబంలో విషాదం చోటుచేసుకుందని, దాని వల్లే ఆ విషయాన్ని గౌరవించి సినిమా పనులు కొన్నిరోజులు ఆపివేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ సెన్సార్ - అందరూ ఇది 'పెద్దలకు మాత్రమే' అనుకున్నారు కానీ!