Bollywood Actress Sonarika Bhadoria Announces Her Pregnancy: బాలీవుడ్ హీరోయిన్ సోనారికా బడోరియా గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బీచ్ వద్ద తన భర్త వికాస్ పరాశర్‌తో కలిసి బేబీ బంప్‌తో ఫోటో షూట్ చేయగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Continues below advertisement

గొప్ప సాహసం

అందమైన సూర్యాస్తమయం సమయంలో తెల్లని దుస్తులు ధరించిన సోనారికా, వికాస్ కపుల్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రకృతి సోయగం నడుమ వీరి ఫోటో షూట్ వైరల్ అవుతోంది. 'మాది ఇప్పటివరకూ జరిగిన గొప్ప సాహసం.' అంటూ ఈ జంట క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు, ఆమె అభిమానులు, నెటిజన్లు సొనారికా కపుల్‌కు విషెష్ చెబుతున్నారు. హీరోయిన్ ఆర్తి సింగ్ కూడా ఈ పోస్ట్ 'Babyyyyyyy' అంటూ లవ్ సింబల్ ఎమోజీలు జత చేశారు.

Continues below advertisement

Also Read: కేరళ వెళుతున్న 'రాజా సాబ్'... ప్రభాస్ పుట్టినరోజు బహుమతి రెడీ చేయడానికి!

2024 ఫిబ్రవరిలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ వికాస్ పరాశర్‌ను సోనారికా వివాహం చేసుకున్నారు. అంతకు ముందు చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు తరచూ సోషల్ మీడియా వేదికగా తమ బెస్ట్ మూమెంట్స్‌ను పంచుకున్నారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలో బిజీగా మారారు.

పార్వతీ దేవిగా పాపులర్

సోనారికా హిందీ, తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించారు. అలాగే, పలు హిందీ సీరియళ్లలోనూ నటించి లక్షలాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. 2011లో 'తుమ్ దేనా మేరా సాత్' షోతో టీవీలోకి అడుగుపెట్టారు. అయితే, 'డెవోన్ కె దేవ్... మహాదేవ్' (2012 - 2013)లో పార్వతీ దేవిగా ఆమె అద్భుత నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆదిశక్తి, దుర్గా, మహాకాళి పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీలో హిస్టారికల్ సీరియల్ 'పృథ్వీ వల్లభ్ ఇతిహస్ భీ, రహాసయా భీ'లో మృణాల్వతి పాత్రలోనూ ఆమె నటించారు. తెలుగులో 'జాదుగాడు' మూవీతో ఎంట్రీ ఇవ్వగా స్పీడున్నోడు, ఆడో రకం ఈడో రకం మూవీలోనూ తన నటనతో మెప్పించారు.