Neha Shetty Confirms Her Surprise Role In Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' మరో 2 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లలో బిజీగా ఉంది. అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా సర్‌ప్రైజెస్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా 'ఓజీ'కి సంబంధించి మరో బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది.

డీజే టిల్లు బ్యూటీ

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫైర్ స్ట్రోమ్ ఓజెస్ గంభీర, సువ్వి సువ్వి లవ్ సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. మరో సాంగ్ గన్స్ అండ్ రోజెస్ కూడా రిలీజ్ కానుంది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతున్నా తాజాగా అది కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డీజే టిల్లు బ్యూటీ 'నేహా శెట్టి'... OGలో సర్ ప్రైజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆమె స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. సాంగ్‌తో పాటే పవన్‌తో కొన్ని సీన్స్‌లోనూ నటించారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై మూవీ టీం అధికారికంగా రియాక్ట్ కావాల్సి ఉంది.

Also Read: నాని ప్యారడైజ్‌లో విలన్‌గా మోహన్ బాబు - మంచు లక్ష్మి లీక్స్

పవన్ డైలాగ్స్... గూస్ బంప్స్ అంతే

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... పవన్ కల్యాణ్ ఇప్పటికే డబ్బింగ్ వర్క్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పవన్ డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో 'ఓజాస్ గంభీర'గా పవన్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటూ మూవీ టీం చెబుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'ఓజీ'నే ట్రెండింగ్‌లో ఉంది. ఫస్ట్ సింగిల్ 'ఫైర్ స్ట్రోమ్' యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక లవ్ సాంగ్ 'సువ్వి సువ్వి' ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంటోంది. 'హంగ్రీ చీతా...', 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' స్పెషల్ బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే జోష్‌తో థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. 'గన్స్ అండ్ రోజెస్' అంటూ మాస్ ఎలివేషన్స్‌తో ఈ పాట సాగనున్నట్లు తెలుస్తుండగా... సోమవారం సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు సాంగ్ రిలీజ్ చేయనున్నారు. 

భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ నెల 25న 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఈ నెల 20న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతుండగా... 19 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

'ఓజీ'కి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించగా... ప్రియాంక్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు.