Manchu Lakshmi Leaks On Mohan Babu In The Paradise Movie: నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ది ప్యారడైజ్'. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ఈ మూవీలో విలన్ రోల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నెగిటివ్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతుండగా... తాజాగా అది కన్ఫర్మ్ అయ్యింది.

Continues below advertisement

లీక్ చేసిన మంచు లక్ష్మి

'మిరాయ్' మూవీ సక్సెస్‌పై తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తన తమ్ముడు మంచు మనోజ్‌పై ప్రశంసలు కురిపించారు మంచు లక్ష్మి. ఈ క్రమంలో పొరపాటున తన తండ్రి మోహన్ బాబు 'ది ప్యారడైజ్'లో నటిస్తున్నట్లు చెప్పేశారు. 'మనోజ్ నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంత దూరం వచ్చాడు. నాకు, మనోజ్‌కు వయసవుతుంది. కానీ ఆయనకు కావట్లేదు. ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు.' అంటూ ఒక్కసారిగా ఆగిపోయారు. వెను వెంటనే నాలుక్కర్చుకున్నారు.

Continues below advertisement

నాని ఏమీ అనుకోరు

'ఏంటీ అఫీషియల్‌గా ఏమీ రాలేదా? నేనే లీక్ చేసేశానా. పర్వాలేదులే నాని ఏమీ అనుకోడు. సోషల్ మీడియా, మీడియాలోనూ దీనిపై ప్రచారం జరిగింది. నేను విన్నా. ఓ సినిమా చేస్తున్నారని మాత్రం తెలుసు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు... తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్సర్‌సైజులు, వ్యాయామాలు చేస్తున్నారు. ఈ వయసులో చాలా మంది యాక్టర్స్ ఏదో 2 గంటలు వర్క్ చేసి అంతుకు మించి చేయలేం అని బిల్డప్స్ ఇస్తుంటారు.

కానీ నాన్న అలా చేయరు. సెట్స్‌కు వస్తే చిన్న పిల్లాడిలా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా అందరితోనూ ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్‌స్పిరేషన్.' అంటూ చెప్పారు.

విలన్ రోల్‌లోనా...

చాలా రోజుల తర్వాత 'ది ప్యారడైజ్' మూవీలో మోహన్ బాబు నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. తాజాగా మంచు లక్ష్మి లీక్స్‌తో అది నిజమని రుజువైంది. 

ఇక ప్యారడైజ్ విషయానికొస్తే... ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా ఓ పవర్ ఫుల్ వారియర్‌‌గా డిఫరెంట్ రోల్‌లో నాని కనిపించనున్నారు. 1960 జరిగినట్లుగా చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌తో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అట్టడుగున ఉన్న తన వర్గాన్ని రక్షించుకునేందుకు వారియర్ ఏం చేశాడు అనేదే ప్రధానాంశం అని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యుయెల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: గన్స్ & రోజెస్... సోమవారమే 'ఓజీ'లో మూడో పాట రిలీజ్... టైమ్ తెలుసా?

చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి కూడా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'దక్ష' మూవీ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తుండగా... శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందించారు.