రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birthday) అక్టోబర్ 23న! ఆ సందర్భంగా 'ది రాజా సాబ్' సినిమా (The Raja Saab Movie)లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సంగతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మిరాయి రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సాంగ్ కోసం ఇప్పుడు యూనిట్ కేరళ వెళ్తోంది. 

కేరళలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ షూటింగ్!'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన సాంగ్‌ (Prabhas Intro Song Raja Saab)ను ఫస్ట్ సాంగ్ కింద రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చారట. సాంగ్ అయితే ఆయన కంప్లీట్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కోసం రాజా సాబ్ యూనిట్ అంతా కేరళ వెళ్లడానికి రెడీ అయింది. 

The Raja Saab SHooting Latest Update: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కేరళలో 'ది రాజా సాబ్' ఫస్ట్ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా... ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేయనున్నారు. లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా? లేదంటే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి సాధారణంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారు. 'ది రాజా సాబ్' పాన్ ఇండియా సినిమా కాబట్టి మారుతి ఏం ప్లాన్ చేశారో చూడాలి.

Also Read'మిరాయ్' పోటీని తట్టుకుని బలంగా నిలబడిన బెల్లంకొండ... ఓపెనింగ్ డే కంపేర్ చేస్తే రెండో రోజు 23 శాతం పెరిగిన కలెక్షన్స్... 'కిష్కింధపురి' టు డేస్ ఇండియా నెట్ ఎంతంటే?

మారుతి డైరెక్షన్ చేస్తున్న 'ది రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి ఎస్కేఎన్ క్రియేటివ్ నిర్మాత. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్ మరో ఇద్దరు హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

Also Readఓపెనింగ్ డే కంటే ఎక్కువ... రెండో రోజూ 'మిరాయ్' జోరు తగ్గలేరు - టు డేస్ @ 50 కోట్లు... టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?