Sobhita Dhulipala: నాగచైతన్య, సమంత వివాహం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో... వారి విడాకులు అంతకంటే ఎక్కువే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అప్పటి నుండి నాగచైతన్య, సమంత పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల ఫోకస్ కూడా పెరిగింది. ప్రస్తుతం సమంత ఎక్కువగా ట్రిప్స్ అంటూ, హెల్త్ కేర్ అంటూ లైఫ్‌లో బిజీ అయిపోయింది. ఇదే సమయంలో నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళతో చైతూ వివాహానికి సిద్ధమయ్యాడని, ఎంగేజ్‌మెంట్‌కు సన్నాహాలు మొదలయ్యాయని టాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ శోభిత ధూళిపాళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?


తెనాలి అమ్మాయి..


మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది శోభిత ధూళిపాళ. ముందుగా 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించి గ్లామర్ వరల్డ్ ఫోకస్ తనపై పడేలా చేసింది. అలా మోడలింగ్ నుండి మెల్లగా యాక్టింగ్‌కు షిఫ్ట్ అయ్యింది. ఎక్కువగా తెలుగు, హిందీలో సినిమాల్లో నటించి మెప్పించిన శోభిత.. ఈమధ్యే హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. 2023లో హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ నటించి డైరెక్ట్ చేసిన ‘మంకీ మ్యాన్’ సినిమాతో మొదటిసారి హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. 1992 మే 31న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించింది శోభిత. తన తండ్రి వేణుగోపాల్ రావు విశాఖపట్నంలో నేవీ ఇంజనీర్‌గా పనిచేసేవారు. కాబట్టి శోభిత బాల్యం అంతా వైజాగ్‌లోనే గడిచింది. తన తల్లి శాంతా కామాక్షి ఒక స్కూల్ టీచర్.



అలా యాక్టింగ్‌లోకి..


చదువుల కోసం వైజాగ్ నుండి ముంబాయ్ ప్రయాణమయ్యింది శోభిత ధూళిపాళ. కార్పొరేట్ లా కోర్స్‌లో అడుగుపెట్టింది. నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా 2010లో నేవీ క్వీన్‌గా కిరీటం కూడా దక్కించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో తను విక్కీ కౌశల్ సరసన స్మృతిక నాయుడు అనే పాత్రలో కనిపించింది. డెబ్యూతోనే తన యాక్టింగ్ టాలెంట్‌తో అందరినీ కట్టిపడేసింది శోభిత. అలా తనకు మరెన్నో బాలీవుడ్ సినిమా అవకాశాలతో పాటు తెలుగు డెబ్యూ ఛాన్స్ కూడా తలుపుతట్టింది.


వెబ్ సిరీస్‌తో క్రేజ్..


శోభిత ధూళిపాళ వరుసగా అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలకాండి’, రాజా మీనన్ దర్శకత్వంలో ‘చెఫ్’లో కీలక పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత అడవి శేష్ ‘గూఢచారి’తో తెలుగులో కూడా అడుగుపెట్టింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వెబ్ సిరీస్ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టింది. 2019లో విడుదలయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్.. శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తెలుగు, హిందీలో బిజీ అయిన తనకు తమిళ, మలయాళం నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’లో శోభిత ధూళిపాళ తనకు కోలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది.



Also Read: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం నేడే - అక్కినేని ఫ్యామిలీ అఫీషియల్‌గా చెబుతుందా?