యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni) హుషారుకు, ఎనర్జీకి నో లిమిట్స్! బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికీ లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే... స్క్రీన్ మీద ఆటంబాంబు తరహాలో ఫైట్లు, సీన్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా? అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 'స్కంద' ఫస్ట్ థండర్. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో గ్లింప్స్ ఆ గ్రాండియర్ చూపించింది. ఆ తర్వాత పాట ఓ పాట విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
'స్కంద' చిత్రీకరణ పూర్తి
'స్కంద' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర నిర్మాణ శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. హీరో హీరోయిన్లు రామ్, శ్రీ లీలపై తాజాగా మాసీవ్ సెట్‌లో చివరి పాటను చిత్రీకరించారు. దాంతో 'స్కంద'కు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి రామ్, శ్రీ లీల ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు.
'స్కంద' చిత్రీకరణ ముగించడానికి ముందు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లోనూ జోరుగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. సంగీత సంచలనం తమన్ స్వరపరిచిన 'నీ చుట్టు చుట్టు' పాట అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉందని నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ఆ పాటలో రామ్, శ్రీ లీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు.
Also Read : త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి - 'ఖుషి' ట్రైలర్ లాంచ్‌లో రౌడీ బాయ్ ఏం చెప్పారంటే?
సెప్టెంబర్ 15న 'స్కంద' విడుదల
'స్కంద' సినిమాను పవన్ కుమార్, జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ థండర్‌లో ''నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా! నీ గేటు దాటలేనన్నావ్... దాటా! నీ పవర్ దాటలేనన్నావ్... దాటా! ఇంకేంటి దాటేది... నా బొంగులో లిమిట్స్!'' అంటూ రామ్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. లిమిట్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో యూత్ ఈ డైలాగ్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో పేరు (రాపో - రామ్ పోతినేని) పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యంగ్ హీరోల్లో హీరో పేరు మీద ఈ స్థాయిలో మాస్ బీజీఎమ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial