ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'స్కంద' (Skanda Movie). శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీ లీల కథానాయిక. 


'స్కంద' ట్రైలర్ విడుదల చేసిన బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ రోజు హైదరాబాద్, శిల్పకళా వేదికలో 'స్కంద' ప్రీ రిలీజ్ థండర్ (Skanda Pre Release Event) నిర్వహించారు. దీనికి భారీ ఎత్తున అభిమానులు హాజరు అయ్యారు. అన్నిటి కంటే ముఖ్యంగా బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. 


'స్కంద' ట్రైలర్ ఎలా ఉందంటే?
Skanda Trailer Review :  'స్కంద' ట్రైలర్ అంతటా బోయపాటి మాస్ హీరోయిజం కనిపించింది. ఆల్రెడీ టీజర్‌లో మాస్ మూమెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో? రామ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో? హింట్ ఇచ్చిన బోయపాటి... ట్రైలర్‌లో మరింత మాస్ చూపించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని కూడా చూపించారు.



'తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి' - ఈ ఒక్క డైలాగ్ చాలు ట్రైలర్ ఎలా ఉందో చెప్పడానికి!


Also Read : మొగుడిని మిర్చిలా నంజుకుతింటున్న పెళ్ళాం - సమంతను తిడుతూ విజయ్ దేవరకొండ పాట


'స్కంద' ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూడండి



ఐదు భాషల్లో 'స్కంద - ది ఎటాకర్' విడుదల
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. రామ్ హీరోగా నటించిన చిత్రాలను హిందీలో డబ్ చేసిన యూట్యూబ్ లో రిలీజ్ విడుదల చేయగా... రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అలాగే, బోయపాటి శ్రీను సినిమాలకు కూడా! ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేశారు. అందువల్ల, 'స్కంద' మీద పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి పడింది.
  
'స్కంద' నుంచి ఆల్రెడీ రెండు పాటలను విడుదల చేశారు. అందులో 'నీ చుట్టూ చుట్టూ' మెలోడీ కాగా... రెండో పాట 'గండర గండర బాయ్' మాస్ ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించేలా ఉంది. బోయపాటి లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ హిట్ పాటలే కాదు, సూపర్ హిట్ రీ రికార్డింగ్ అందించారు. వాళ్ళది హిట్ కాంబినేషన్. అలాగే... రామ్, తమన్ కలయికలో కూడా హిట్ సాంగ్స్ & సినిమాలు ఉన్నాయి. దాంతో 'స్కంద' పాటలే కాదు... నేపథ్య సంగీతంపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి.


Also Read హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?



రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో కథానాయిక. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial