సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) గొప్ప మనసు చాటుకున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థకు ప్రచారకర్తగా ఆమె వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సంస్థ ప్రచార చిత్రాల్ని విడుదల చేసింది. అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ (new york time square)లో ఆ యాడ్ ఫొటోల్ని ప్రదర్శించారు. ఆ యాడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల్ని సేవకు ఇచ్చినట్లు చెప్పారు.
ఛారిటీకి ఇచ్ఛాను - సితార
జ్యువెలరీ యాడ్ చేయడం వచ్చిన రెమ్యూనరేషన్ ఏం చేశారు? మీ అమ్మ గారికి ఇచ్చారా? నాన్నగారికి ఇచ్చారా? అని అడిగితే... ''ఛారిటీకి ఇచ్చాను'' అని సితార ఘట్టమనేని సమాధానం ఇచ్చారు. సినిమాల్లోకి వస్తానని కూడా తెలిపారు. ఈ యాడ్ ఫోటోలు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ సెంటర్లో తన ఫోటోల్ని చూసినప్పుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయని, నాన్నను హత్తుకుని గట్టిగా ఏడ్చేశానని సితార తెలిపారు.
గౌతమ్ తెరంగేట్రానికి ఎనిమిదేళ్ళు - నమ్రత
తాను సినిమాల్లోకి వస్తానని సితార తెలిపారు. మరి, గౌతమ్ సంగతి? మహేష్ బాబు ముద్దుల కుమారుడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు? ఈ ప్రశ్నలకు కూడా నమ్రత సమాధానాలు ఇచ్చారు. ఏడేళ్ళు పట్టవచ్చని చెప్పారు.
''ఇప్పుడు గౌతమ్ వయసు 16 ఏళ్ళు. గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. అది పూర్తి చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. సినిమాల్లోకి రావడానికి ఎనిమిదేళ్ళు పట్టవచ్చు'' అని నమ్రత తెలిపారు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'వన్ నేనొక్కడినే' సినిమాలో గౌతమ్ నటించారు. హీరో చిన్నప్పటి పాత్రను పోషించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. 'సర్కారు వారి పాట' సినిమాలో 'పెన్నీ' ప్రచార చిత్రంలో సితార కనిపించారు.
Also Read : ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ 'కాలచక్రం'- కె మీనింగ్ అదేనా?
తమ పిల్లలు ఇద్దరూ సినిమాల్లోకి వస్తానంటే, తాము 'ఓకే' చెబుతామని, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మహేష్ బాబు సతీమణి నమ్రత తెలిపారు. సితార చేసిన జ్యువెలరీ యాడ్ మహేష్ బాబుకు బాగా నచ్చిందని, ఆ యాడ్ చాలాసార్లు చూశారని ఆమె తెలిపారు.
Also Read : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్
ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు వస్తే... మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న 'గుంటూరు కారం' సెట్స్ మీద ఉంది. అందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే... మహేష్ బాబును త్రివిక్రమ్ మాసీగా చూపిస్తున్నారని అర్థం అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
'గుంటూరు కారం' తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. అది పాన్ వరల్డ్ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఆ సినిమా కోసం మహేష్ బాబు నాలుగైదు నెలలు మార్షల్ ఆర్ట్స్ సహా కొంత యాక్షన్ ట్రైనింగ్ తీసుకోనున్నారట. వచ్చే ఏడాది మహేష్ బాబు, రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఆ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం తీస్తాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial