తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నగర శివారుల్లోని ఒక రిసార్ట్‌లో ప్రముఖ గాయని పార్టీ ఇవ్వడం, అందులో గంజాయి వాడారని పోలీసుల కేసు నమోదు చేయడం తెలిసిన విషయాలే. అలాగే అనుమతి లేకుండా విదేశీ మద్యం సైతం ఉపయోగించారని కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ పార్టీలో పలువురు తెలుగు సినిమా సెలబ్రిటీలు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి వచ్చిన కమెడియన్ 'రచ్చ' రవి కూడా ఉన్నారని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. 

ఇంటికి వెళ్లడానికి కూడా ఖాళీ లేదు!మంగ్లీ పుట్టిన రోజు పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని 'రచ్చ' రవి స్పష్టం చేశారు. ఆ కేసు గురించి మీడియాకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మంగ్లీ కేసు గురించి రచ్చ రవి మాట్లాడుతూ... ''మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ పార్టీలో నేను పాల్గొన్నట్లు కొంత మంది మీడియా మిత్రులు రిపోర్టు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకునేది ఒక్కటే... నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ పార్టీకి వెళ్లలేదు. గత కొన్ని రోజులుగా నా షెడ్యూల్ చాలా బిజీ. వరుసగా షూటింగ్స్ చేస్తున్నాను. సొంత కుటుంబాన్ని చూడడానికి ఇంటికి వెళ్లడానికి కూడా నాకు టైం ఉండడం లేదు. ఇటువంటి సమయంలో నేను ఆ పార్టీకి వెళ్లానని న్యూస్ ఛానల్స్, మీడియా కథనాలలో నా పేరు రావడం చూసి ఆశ్చర్యపోయాను. దయచేసి నిజానిజాలు తెలుసుకుని రాయగలరు'' అని పేర్కొన్నారు.

Also Read'పడక్కలం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న సింగర్స్ లిస్టులో మంగ్లీ ముందు వరుసలో ఉంటారు. జానపద గాయనిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆవిడ... టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ సింగర్స్‌లో ఒకరిగా ఎదిగారు.‌ స్టార్ హీరోల సినిమాల్లో ఆవిడ సాంగ్ కంపల్సరీ అయ్యిందని చెప్పవచ్చు.

Also Readబ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ