Panchayat Web Series Season 4 OTT Release On Amazon Prime Video: సూపర్ హిట్ కామెడీ డ్రామా సిరీస్ అంటేనే మనకు గుర్తొచ్చేది 'పంచాయత్'. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ సైతం స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. తాజాగా.. అనుకున్న టైం కన్నా ముందుగానే ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్‌ను ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇదివరకూ జులై 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్ మార్చారు. కొత్త సీజన్ పంచాయతీ ఎన్నికలే ప్రధానంగా సాగనుందని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'ఎన్నికల సీజన్ వచ్చేసింది. యుద్ధానికి ప్రారంభమవుతోంది.' అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ ఉండనున్నట్లు టీజర్, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

గత 3 సీజన్లలో సిటీలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న ఓ యువకుడు అభిషేక్ త్రిపాఠీ ఉద్యోగావకాశాలు లేక తన తండ్రి సూచన మేరకు గవర్నమెంట్ జాబ్ అనే ఆశతో విలేజ్‌లో ఓ పంచాయతీకి సెక్రటరీగా జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, అక్కడి మనుషుల తీరును కామెడీగా చూపించారు. ఈ సిరీస్ 3 సీజన్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించగా.. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝూ కీలక పాత్రలు పోషించారు.

ఫస్ట్ సీజన్ 2020లో రాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్ తో సెకండ్ సీజన్ 2022, థర్డ్ సీజన్ 2024లో రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా అలరిస్తుందని తెలుస్తోంది.

Also Read: రేంజ్ రోవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తూఫాన్... మోడీ డైలాగ్ వాడిన హరీష్... ఉస్తాద్‌ సెట్స్‌లో పవన్

తెలుగు సివరపల్లి

తెలుగులో ఈ సిరీస్‌ను 'సివరపల్లి'గా రూపొందించారు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే రెండో సీజన్ కూడా రాబోతోంది. తెలుగు సిరీస్‌లో రాగ్ మయూర్, రూపలక్ష్మి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది.