జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆ మధ్య ఒక కార్యక్రమంలో 'పవన్ నహీ, ఆందీ హై' అని చెప్పారు. ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ ఆ డైలాగ్ వాడేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో షేర్ చేస్తూ 'ఇస్ బార్ సిర్ఫ్ ఆందీ నహీ, తూఫాన్ హై' (ఈసారి వచ్చేది ఆందీ కాదు... తూఫాన్) అని పేర్కొన్నారు. పవన్ గురించి మోడీ ఇచ్చిన ఎలివేషన్ మరోసారి గుర్తు చేస్తూ తన సినిమా సెట్స్‌లో తూఫాన్ ఎంటర్ అయ్యిందని పేర్కొన్నారు. 

Continues below advertisement


రేంజ్ రోవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పవన్!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. జూన్ 10 (మంగళవారం) హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ మొదలు అయింది.‌ సెట్స్‌కు పవన్ స్వయంగా రేంజ్ రోవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన డ్రైవింగ్ అంటే ఇష్టం అనేది తెల్సిన విషయమే. ఇంతకు ముందు హైదరాబాద్ మెట్రోలో 'వకీల్ సాబ్' షూటింగ్ జరిగినప్పుడు కూడా స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చారు. 


'సరికొత్త ఎనర్జీతో తుఫాన్ చిత్రీకరణకు వచ్చింది' అని పవన్ కళ్యాణ్ వీడియో షేర్ చేసింది 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్. ఆయనకు దర్శకుడితో పాటు నిర్మాత రవిశంకర్ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమాలో హీరోయిన్ శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మొదటి రోజు వాళ్ళిద్దరిపై కొన్ని సీన్స్ తీశారు. ఇతర ప్రధాన తారాగణం సైతం చిత్రీకరణకు వస్తున్నారని తెలిసింది. సుమారు నెల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం.


Also Read: 'పడక్కలం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్






'గబ్బర్ సింగ్' విడుదలైన 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఇది. అభిమానులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్.


Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్... 'అఖండ 2'లో ఆది పినిశెట్టి క్యారెక్టర్ రివీల్ చేశారుగా... లుక్ చూడండి