Anchor Jhansi Stops Minister Speech For Inviting Sreeleela: తెలుగు టాప్ యాంకర్లలో ఝాన్సీ ఒకరు. తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో చేసిన అతి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. యాప్ లాంచ్ ఈవెంట్‌లో మినిస్టర్ స్పీచ్ జరుగుతుండగా.. అది ఆపేసి.. ఆమె హీరోయిన్‌ను స్టేజీపైకి ఆహ్వానించారు. దీనిపై నెట్టింట కొందరు విమర్శలు గుప్పించారు.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లో SITHA (She Is The Hero Always) అనే యాప్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ ప్రారంభించారు మినిస్టర్. ఆ తర్వాత ఆయన స్పీచ్ ప్రారంభం కాగా.. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చారు హీరోయిన్ శ్రీలీల. 

ఇదే సమయంలో శ్రీలీలను వేదిక మీదకు పిలిచేందుకు యాంకర్ ఝాన్సీ అత్యుత్సాహం చూపించారు. మినిస్టర్ స్పీచ్‌కు అంతరాయం కలిగించగా ఆయన కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. 'ఆమెను నేను వేదికపై పిలవాలా?' అని అడగ్గా.. ఝాన్సీ నేరుగా అక్కడకు వచ్చి.. 'మంత్రివర్యులు క్షమించాలి.. బట్ 'షీ ఈజ్ ద హీరో ఆల్వేస్' అనే యాప్ ప్రారంభిస్తున్నాం కాబట్టి షీకి హీరో తను అని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్, చాలా చిన్న వయసులో ఆంత్రప్రాన్యూర్ అయిన శ్రీలీల గెస్ట్‌గా విచ్చేశారు. వెల్ కం హెర్ ఆన్ టు ద స్టేజ్' అంటూ హీరోయిన్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించారు.

ఆ తర్వాత వేదిక మీదకు వచ్చిన శ్రీలీల మంత్రిని కలిసి అభివాదం చేస్తూ.. అంతరాయానికి సారీ చెబుతూ విష్ చేశారు. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. 'మరో హీరో మనతో చేరారు' అంటూ నవ్వుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. శ్రీలీల నవ్వుతూనే వెళ్లి అతిథుల వద్ద నిలబడ్డారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలు చేతి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి వారి ప్రొడక్ట్స్ ప్రదర్శించేందుకు 'SITHA' యాప్ సలహాలు, సూచనలు ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. "ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తోన్న గ్రామీణ మహిళలకు ఈ యాప్ మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం డిజిటల్ ప్రొడక్ట్ మాత్రమే కాదు. మహిళ సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఓ శక్తివంతమైన అడుగు' అని ఆయన అన్నారు.

Also Read: నితిన్ 'తమ్ముడు' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ట్రైలర్ లోడింగ్.. ఫ్యాన్స్ వెయిటింగ్

నెటిజన్ల విమర్శలు

అయితే, దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. యాంకర్ ఝాన్సీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హీరోయిన్‌ను స్టేజీ మీదకు పిలవడం ముఖ్యమేనని.. దాని కోసం మినిస్టర్ స్పీచ్ ఆపాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. మినిస్టర్ స్పీచ్ మధ్యలోనే ఆపేసి 'సారీ చెప్పడం ఎందుకు?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం 'SITHA' యాప్ లాంచ్ చేశారని.. అందులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి కనుకనే 'శ్రీలీల'కు ఇంపార్టెన్స్ ఇస్తూ అలా స్టేజీ మీదకు పిలిచారని అంటున్నారు. ఏది ఏమైనా యాంకర్ ఝాన్సీ అతి చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.