Singer Kalpana health condition update: సింగర్ కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆవిడ... ప్రస్తుతం కేపిహెచ్బీలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుండగా, తాజాగా డాక్టర్స్ ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 


కల్పన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ 


కల్పన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని వార్తలు వైరల్ అవుతుండడంతో, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా డాక్టర్లు ఆమె ఇప్పుడు బాగానే ఉందని తెలియజేస్తూ ఓ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. అందులో "సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగారు. అయితే ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ పై ఉంచి, ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆక్సిజన్ అందిస్తూ, ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉంది" అని డాక్టర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కల్పనా స్టేట్మెంట్ ను ఈరోజు పోలీసులు రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 


హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లో ఓ విల్లాలో నివాసం ఉంటున్న కల్పనా మంగళవారం సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇదంతా జరిగే ముందే ఆమె చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది. కాలనీ సంఘం ప్రతినిధులకు ఆయన సమాచారం ఇవ్వడంతో, వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. వెంటనే పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, అప్పటికే కల్పన స్పృహ తప్పి పడిపోయిన సిచువేషన్ లో కనిపించింది. పోలీసులు ఆమెను దగ్గర్లోని హోలిస్టిక్ అనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అప్పటికే విషమంగా ఉండడంతో డాక్టర్స్ వెంటిలేటర్ పై ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు. 


Also Read: సింగర్ కల్పన కెరీర్‌లో బెస్ట్ తెలుగు సాంగ్స్... 1500 పాటల్లో, తెలుగులో టాప్ 10 లిస్ట్‌ ఇదిగో



కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదేనా ?


ఈ నేపథ్యంలోనే కల్పన ఇలా ఆత్మహత్యాయత్నం చేయడానికి తన కూతురే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. కల్పనకు తన కూతురుతో చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఆమె కూతురు వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు కాగా, కేరళలో ఉంటుంది. అయితే మొదటి భర్త కూతురైన ఈ అమ్మాయి వల్లే కల్పన నిద్ర మాత్రలు మింగిందని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో కల్పన రెండో భర్తని పోలీసులు విచారించారు. త్వరలోనే ఆమె కూతుర్ని కూడా విచారించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే కల్పన స్టేట్మెంట్ ఇస్తేనే గాని అసలేం జరిగింది అన్న విషయంపై క్లారిటీ రాదు.


Also Read'రక్త చరిత్ర'కు 40 వేలే... 'గబ్బర్ సింగ్'కు 40 లక్షలు... పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే యాక్టర్ రేంజ్ అలా ఉంటుంది మరి, ఆ నటుడు ఎవరో తెలుసా?