ఈమధ్యకాలంలో మూవీ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు నటీనటులకు చాలా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాము ప్రమోట్ చేస్తున్న సినిమా గురించి, కెరీర్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి అడిగి నటీనటులను ఇబ్బందిపెడుతున్నారు. కొందరు జర్నలిస్టులు. హీరో సిద్ధార్థ్ కూడా అలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కున్నాడు. ముఖ్యంగా సురేశ్ కొండేటి నుంచి అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి తాజాగా తన మూవీ ప్రమోషన్స్ సమయంలోనే ముందుగా ఇన్‌డైరెక్ట్‌గా సురేశ్‌కు వార్నింగ్ ఇచ్చారు సిద్ధార్థ్. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన కావేరీ వివాదం గురించి స్పందించారు.


సిద్ధార్థ్.. ప్రస్తుతం ‘చిత్త’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ మూవీని ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేయాలని సిద్ధార్థ్ డిసైడ్ అయ్యాడు. అందుకే తెలుగుతో పాటు కన్నడలో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. కానీ ఈ మూవీ కన్నడ వర్షన్‌ను ప్రమోట్ చేయడానికి బెంగుళూరు వెళ్లిన సిద్ధార్థ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కావేరి వివాదానికి సపోర్ట్ చేయాలని చెప్తూ.. సిద్ధార్థ్ ప్రమోషనల్ ప్రెస్ మీట్‌ను అర్థాంతరంగా ఆపేశారు కొందరు వ్యక్తులు. ఈ విషయంపై తెలుగు ప్రెస్ మీట్‌లో సిద్ధార్థ్‌ను ప్రశ్నించబోయాడు సురేశ్ కొండేటి. ప్రశ్న అడిగే ముందు సిద్ధార్థ్.. ఆయనకొక వార్నింగ్ ఇచ్చారు.


సురేశ్ కొండేటికి స్మూత్ వార్నింగ్


‘‘కొండేటి సురేశ్‌కు ఒక వార్నింగ్. మొత్తం ఇంటర్నెట్ మీకొక వార్నింగ్ ఇవ్వమంది. ఆయనని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా మైక్ పట్టుకొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత మీది కాదు. ఇంకొకసారి సమాధానం చెప్పొద్దు అని నాకొక సలహా ఇచ్చారు ఇంటర్నెట్‌లో. అప్పుడు నేను చెప్పాను సురేశ్ కొండేటి నా ఫ్రెండ్. అతనికి రైట్స్ ఉన్నాయి.’’ అంటూ వార్నింగ్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చాడు సిద్ధార్థ్. ఈ హీరో ఇచ్చిన డిఫరెంట్ వార్నింగ్‌కు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సిద్ధు ఇంత చెప్పిన తర్వాత కావేరీ జలాల సమస్య గురించి, దాని వల్ల బెంగుళూరు ప్రెస్ మీట్‌లో చెలరేసిన దుమారం గురించి ప్రశ్నించారు సురేశ్.


చెవులు లేనివాళ్లతో మాట్లాడి పాయింట్ ఏంటి?


‘‘ఇది నేను ఇప్పటికే చెప్పేశాను. ఇది ఏ దృష్టిలో నేను చూడగలను అంటే నేను సొంత డబ్బులు పెట్టి ఓ కొత్త భాష నేర్చుకొని, ఆ భాషలో మా సినిమాలు రావట్లేదే అన్న బాధలో ఇంకో కోటిన్నర ఖర్చుపెట్టి నేనే సొంతంగా డబ్బింగ్ చేసి, ఒక సినిమాను కన్నడలో రిలీజ్ చేయడానికి ఇక్కడ పనులు అన్నీ మానేసి బెంగుళూరుకి వెళ్లి, ఆ సినిమాకు గురించి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు.. ఇక నుంచి నా అన్ని సినిమాలు కన్నడలో డబ్ అవుతాయి అని చెప్తున్నాను వాళ్లు అందరూ వచ్చేశారు. వాళ్లతో మాట్లాడడం ఎందుకు? వాళ్లు వినే పరిస్థితిలో ఉంటే మాట్లాడతారు. చెవులు లేనివాళ్లతో మాట్లాడి పాయింట్ ఏంటి.’’ అంటూ తన ప్రెస్ మీట్‌ను అడ్డుకున్న వారిపై సున్నితంగా మండిపడ్డాడు సిద్ధార్థ్.


Also Read: నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial